రష్యాపై యూ‌ఎస్ ఆంక్షలు, రష్యా ప్రతీకార చర్యలు

రష్యాపై అమెరికా విధించిన తాజా ఆంక్షలకు రష్యా ప్రతీకార చర్య ప్రకటించింది. అమెరికాకు చెందిన 755 మంది దౌత్య వేత్తలు, అధికారులు, సిబ్బందిని దేశం నుండి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. బహిష్కృతులైన అధికారులు, సిబ్బంది సెప్టెంబర్ 1 లోపు రష్యా నుండి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఇరాన్, ఉత్తర కొరియా, రష్యా లపై ఆంక్షలు విధిస్తూ తయారు చేసిన బిల్లుకు అమెరికన్ సెనేట్ ఆమోద ముద్ర వేసిన దరిమిలా రష్యా ఈ బహిష్కరణ నిర్ణయం ప్రకటించింది. 755 మంది దౌత్య…

క్లుప్తంగా…. 01.05.2012

రాష్ట్రపతి ఎన్నిక పై ఎన్.డి.ఏ లో విభేదాలు రాష్ట్రపతి ఎన్నిక విషయంలో కాంగ్రెస్ తో సహకరించే విషయమై ఎన్.డి.ఏ కూటమిలో విభేదాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ ప్రతిపాదించిన ఉపరాష్ట్ర పతి అన్సారీ, కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ లలో ఎవరికీ మద్దతు ఇవ్వబోమని బి.జె.పి ప్రకటించడం పట్ల జె.డి(యు) నిరసన తెలిపింది. 2014 ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ వెంట తాము లేమని చెప్పుకోవలసిన అవసరం ఉందని బి.జె.పి నాయకురాలు సుష్మా స్వరాజ్ పత్రికలతో మాట్లాడుతూ చెప్పారు. తమతో…