ఉత్తర కొరియా: ఆసియా-పివోట్ వ్యూహాన్ని పై మెట్టు చేర్చిన ట్రంప్ -2

చారిత్రక కోణం ఒక భూతంగా, ప్రపంచ సమస్యగా అమెరికా ముందుకు తెచ్చిన ఉత్తర కొరియా విషయంలో చారిత్రక కోణం తరచుగా విస్మరణకు గురవుతోంది. సమకాలీన రాజకీయార్ధిక విశ్లేషణా నిపుణులు సైతం ఉత్తర కొరియాపై ఆరంభం నుండి అమెరికా అనుసరిస్తూ వచ్చిన దాష్టీకం గురించి వివరించి చెప్పడంలో విఫలం అవుతున్నారు. ఉత్తర కొరియా – అమెరికా, ఉత్తర కొరియా – జపాన్, ఉత్తర కొరియా – చైనాల మధ్య చోటు చేసుకున్న చారిత్రక పరిణామాలను చెప్పుకోకపోతే సమస్యను పాక్షికంగా…

చైనా సరిహద్దుకు 100 ట్యాంకులు తరలింపు! 

దారిన పోయే దరిద్రాన్ని పిలిచి తలకెత్తుకోవటం అంటే ఇదే కావచ్చు. NSG (న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్) సభ్యత్వం కోసం ఎన్నడూ లేని విధంగా బీజింగ్ చుట్టూ చక్కర్లు కొట్టిన ప్రధాన మంత్రి ఇప్పుడు సరిహద్దు వద్ద ఉద్రిక్తత పెరిగేందుకు దోహదం చేస్తూ చైనాతో ఘర్షణ వాతావరణం పెంచే విధంగా గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్నారు. వివాదాస్పద సరిహద్దు కలిగిన లడఖ్ ఏరియా లోకి భారీ ఎత్తున యుద్ధ ట్యాంకులను  భారత ప్రభుత్వం తరలించింది. జమ్మూ & కాశ్మీర్, టిబెట్ ప్రాంతాల…

ప్రశ్న: సిల్క్ రోడ్ పేరు విశిష్టతల గురించి…

  ఎన్.రామారావు: ఈ మధ్య సిల్క్ రోడ్ అన్న పేరు తరచుగా వినిపిస్తోంది. ఆ పేరు ఎందుకు వచ్చింది? అంత విశిష్టత ఎందుకు? సమాధానం: ప్రాచీన నాగరికతలు విలసిల్లిన దేశాలలో చైనా, భారత ఉపఖండం, మెసపోటేమియా (ఇరాక్), గ్రీసు, రోమన్ (ఇటలీ)లు ముఖ్యమైనవి. చైనా నుండి ఈ ప్రదేశాలకు భూమార్గంలో అతి పొడవైన వాణిజ్య మార్గం ఉండేది. ఈ మార్గం గుండా జరిగే వాణిజ్యంలో సిల్క్ వాణిజ్యం భాగం ఎక్కువగా ఉండేది. దానిని దృష్టిలో పెట్టుకుని 1877లో…

మోడి: ఇక ఛలో చైనా!

అమెరికా వెళ్ళి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడి త్వరలో చైనా పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మోడి చైనా సందర్శనకు తగిన దౌత్య ఏర్పాట్లు చేయడం కోసం భారత విదేశీ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్నారు. ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు మరింత తీవ్రం చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సుష్మా పేర్కొనడం విశేషం. ఇందుకోసం ఇరు దేశాల మీడియా సహకరించాలని సుష్మా స్వరాజ్ తో పాటు చైనా దౌత్యవేత్తలు సైతం…

శ్రీలంక ఎన్నికలు: దక్షిణాసియాలో పెరుగుతున్న అమెరికా పెత్తనం

దక్షిణాసియాలో వ్యూహాత్మకంగా కీలక ప్రాంతంలో ఉన్న మన పొరుగు దేశం శ్రీలంకలో అద్యక్ష ఎన్నికలు ముగిశాయి. రాజ్యాంగాన్ని సవరించి మరీ మూడోసారి అద్యక్షరికం చెలాయిద్దామని ఆశించిన మహేంద్ర రాజపక్సేకు శృంగభంగం అయింది. పదవీకాలం ఇంకా రెండు సంవత్సరాలు మిగిలి ఉన్నప్పటికీ ఎన్నికలు జరిపించిన రాజపక్సే అనూహ్య రీతిలో ఓటమి పాలయ్యాడు. ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు అధికార పార్టీ అయిన శ్రీలంక ఫ్రీడం పార్టీ (ఎస్.ఎల్.ఎఫ్.పి) లోనూ, ప్రభుత్వం లోనూ ప్రధాన బాధ్యతలు నిర్వహించిన మైత్రీపాల…

మా వ్యతిరేక కూటమిలో ఇండియా చేరదు -చైనా

భారత ప్రధాని నరేంద్ర మోడి అమెరికా పర్యటన ముగిసిన నేపధ్యంలో పర్యటన అనంతర పరిస్ధితిని చైనా ప్రభుత్వ అధికార పత్రిక పీపుల్స్ డెయిలీ సమీక్షించింది. అమెరికా తన నేతృత్వంలో తలపెట్టిన చైనా వ్యతిరేక కూటమిలో ఇండియా చేరే అవకాశం లేదని మోడి అమెరికా పర్యటన ద్వారా గ్రహించవచ్చని పత్రిక పేర్కొంది. తమ అవగాహనకు కారణాలను పత్రిక వివరించింది. భారత విదేశీ విధానం పునాదులు అలీన ఉద్యమంలో ఉన్నందున ప్రపంచ ధృవ పోటీల్లో ఇండియా ఒక పక్షం వహించబోదని…