క్లుప్తంగా… 08.05.202

జాతీయం జ్యువెలర్స్ పన్ను ఉపసంహరించిన ప్రణబ్ నగల వ్యాపారుల ఒత్తిడికి ఆర్ధిక మంత్రి తలొగ్గాడు. జ్యువెలర్స్ వ్యాపారుల తరపున తీవ్ర స్ధాయిలో జరిగిన లాబీయింగ్ ముందు చేతులెత్తేశాడు. బ్రాండెడ్ మరియు అన్ బ్రాండెడ్ నగల దిగుమతులపై పెంచిన 1 శాతం పన్ను ఉపసంహరించుకున్నాడు. పన్ను ఉపసంహరణతో పాటు పన్ను పెంపు ప్రతిపాదిస్తూ చేసిన అనేక చర్యలను సరళీకరించాడని పత్రికలు తెలిపాయి. జ్యూవెలరీ రంగంలో విదేశీ పెట్టుబడుల ఆహ్వానాన్ని మరో సంవత్సరం పాటు వాయిదా వేసుకున్నట్లు కూడా తెలుస్తోంది.…

బిన్ లాడెన్ వారసుడు, ఆల్-ఖైదా నాయకుడుగా డా. ఐమన్ అల్-జవహిరి నియామకం

ఒసమా బిన్ లాడెన్ హత్య జరిగిన ఆరు వారాల అనంతరం ఆయన వారసుడిని ఆల్-ఖైదా నియమించుకుంది. లాడెన్‌కి కుడిభుజంగా పేరుపొందిన ఐమన్ ఆల్-జవహిరి అందరూ భావించినట్లుగానే ఆల్-ఖైదా సుప్రీం నాయకుడుగా నియమితుడయ్యాడు. ఆల్-ఖైదా జనరల్ కమాండ్ ఈ నియామకం జరిపినట్లుగా ఆల్-ఖైదా మీడియా విభాగం ఒక మిలిటెంట్ల వెబ్ సైట్ లో ప్రకటించింది. “షేక్ డా. ఐమన్ ఆల్-జవహిరి, భగవంతుడు ఆయనను నడిపించుగాక, ఆల్-ఖైదా అమిర్ (నాయకుడు) గా భాధ్యతలు స్వీకరించాడు” అని ఆ ప్రకటన పేర్కొంది.…