ఇరాక్: ఆల్-జజీరా చానెల్ అనుమతి రద్దు

కతార్ రాజ్యాధినేత నడుపుతున్న ఆల్-జజీరా ఛానెల్ ఇరాక్ లో ప్రసారాలు చేయకుండా అక్కడి ప్రభుత్వం అనుమతి రద్దు చేసింది. సిరియా కిరాయి తిరుగుబాటుదారులకు ఆయుధ, ధన, మానవ వనరుల సహాయం అందజేస్తున్న కతార్ చానెల్ ఇరాక్ లో కూడా సెక్టేరియన్ విభజనలను రెచ్చగొడుతోందని ఇరాక్ ప్రభుత్వం ఆరోపించింది. ఆల్-జజీరాతో పాటు మరో 9 టి.వి చానెళ్లకు కూడా ఇరాక్ ప్రభుత్వం అనుమతి రద్దు చేసింది. ఈ మేరకు ఇరాక్ అధికారులు ఆదివారం ప్రకటించారు. మెజారిటీ మతస్ధుల షియా…

క్లుప్తంగా… 09.05.2012

జాతీయం పరువు హత్యలకు యు.పి డి.ఐ.జి మద్దతు తన కూతురు ఇంటి నుండి పారిపోయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుందనీ, అబ్బాయిపై చర్య తీసుకోవాలనీ ఫిర్యాదు చేసిన వ్యక్తికి కూతురిని చంపెయ్యమని అత్యున్నత పోలీసు అధికారి సలహా ఇవ్వడం సంచలనం రేపింది. తండ్రి స్ధానంలో తానున్నట్లయితే కూతురిని చంపేయ్యడమో లేదా తానే ఆత్మహత్య చేసుకోవడమో చేసేవాడినని సలహా ఇస్తుండగా సంభాషణను కేమెరాలు బంధించడంతో డి.ఐ.జి ఎస్.కె.మాధుర్ వ్యవహారం లోకానికి వెల్లడయింది. రెగ్యులర్ చెకింగ్ కోసం ఓ పోలీసు…

లిబియా యుద్ధం: ఈ కార్యక్రమాన్ని ప్రాయోజితమొనర్చినవారు… … -కార్టూన్

“నిజం చెప్పులు తొడిగే లోపు అబద్ధం ఊరంతా చుట్టొస్తుంద”ని సామెత. రెండో ప్రపంచ యుద్ధంలో గోబేల్స్ సాగించిన దుష్ప్రచారం గురించి ఇప్పటికీ చెప్పుకుంటాం. ఒక అబద్ధాన్ని పది సార్లు చెప్పి నిజంగా మార్చే కళ గోబెల్స్ రుజువు చేశాడని పాఠాలు తీస్తాం. కాని గోబెల్స్ వద్ద నేర్చుకున్న పాఠాల్ని పశ్చిమ సామ్రాజ్యవాద దేశాలు, వాటి ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాపితంగా విస్తరించి ఉన్న కార్పొరేట్ పత్రికలు ఇప్పటికే అమలు చేస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే గోబెల్స్‌కే పాఠాలు నేర్పేవిధంగా తయారయ్యారు.…