సూర్య నమస్కారం ఇస్లాంకి వ్యతిరేకం(ట)!

శాస్త్ర బద్ధ అంశాలకు మతాన్ని జోడిస్తే వచ్చే దుష్ఫలితం ఇది! మానవ ఆరోగ్యానికి ఇతోధికంగా దోహదం చేసే ‘యోగా’, ‘సూర్య నమాస్కారాలు’ ఇస్లాం కి వ్యతిరేకం కాబట్టి వాటిని పాఠశాలల్లో బోధించకూడదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు డిమాండ్ చేస్తోంది. తద్వారా బ్రూనోను తగలబెట్టిన క్రైస్తవాన్ని, వేదాలు వినకుండా పంచముల చెవుల్లో సీసం పోసిన మనువాదాన్ని ముస్లిం బోర్డు స్ఫురణకు తెస్తోంది. రాజస్ధాన్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లోని బి.జె.పి ప్రభుత్వాలు ఇటీవల తమ పాఠశాలల్లో…