నోట్ల రద్దు: వివరాలు చెబితే ప్రాణాలకు ముప్పు -ఉర్జిత్

పెద్ద నోట్ల రద్దు చర్యకు ఎందుకు, ఎలా పూనుకున్నారో చెప్పండయ్యా అని అడుగుతుంటే కాని కారణాలు ఎన్నో చెబుతున్నారు. తరచుగా ఈ కారణాల మధ్య పొంతన ఉండడం లేదు. ఒకరు చెప్పిన కారణాలు మరొకరు చెప్పడం లేదు. మోడీ ఒకటి చెబితే జైట్లీ మరొకటి చెబుతారు. RBI గవర్నర్ గారు నోరు మెదపరు. ఇలా కాదని RTI చట్టాన్ని ఆశ్రయిస్తే ఆయన సరికొత్త కారణాలు చెబుతున్నారు.  నోట్ల రద్దు వల్ల తన ప్రాణానికి ముప్పు వచ్చిందనీ తనను…

వ్యూహాత్మక నిష్క్రమణ -ద హిందూ ఎడిట్..

[ఈ రోజు -జూన్ 20- ది హిందు ప్రచురించిన ఎడిటోరియల్ “A strategic exit” కు యధాతధ అనువాదం. -విశేఖర్] ********* సెప్టెంబర్ లో తన పదవీకాలం ముగిసిన తర్వాత రెండో సారి పదవికి రేసులో ఉండబోవటం లేదని ప్రకటించటం ద్వారా ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్, అంతకంతకు గుణ విహీనం గా మారుతున్న పరిస్థితుల నుండి మెరుగైన రీతిలో, గౌరవప్రదంగా బైటపడే మార్గాన్ని ఎంచుకున్నారు. కొన్ని నెలలుగా ఆయన కొనసాగింపు పట్ల మోడి ప్రభుత్వంలో కొన్ని…

వడ్డీ రేట్లు: పరిశ్రమ వర్గాల ఏడుపు – కార్టూన్

రెండు రోజుల క్రితం ఆర్.బి.ఐ గవర్నర్ వడ్డీ రేట్లు సమీక్షించారు. ఈ సమీక్షలో ఆయన వడ్డీ రేట్లు తగ్గిస్తారని అందరూ ఆశించారు. అయితే వారి ఆశలను వమ్ము చేస్తూ గవర్నర్ రఘురామ్ రాజన్ వడ్డీ రేట్లు కదల్చకుండా యధాతధంగా ఉంచారు. వడ్డీ రేట్ల వ్యవహారం ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వంల మధ్య ఎప్పుడూ ఘర్షణకు దారి తీసే అవకాశం గల సమస్యగా ఉంటోంది. దీనికి ప్రధాన కారణం వడ్డీ రేట్ల చుట్టూ ఏర్పడి ఉన్న వాతావరణం. వడ్డీ రేటు…

ఆర్.బి.ఐ ఆశ్చర్యకర వడ్డీ కోత! -ది హిందు

మార్కెట్లను ఆశ్చర్యంలో ముంచెత్తగల సామర్ధ్యం సెంట్రల్ బ్యాంకింగ్ యొక్క ముఖ్యమైన లక్షణాలలో ఒకటి. ఆర్.బి.ఐ గవర్నర్ రఘురాం రాజన్, గురువారం నాడు వడ్డీ రేట్లను 0.25 శాతం మేర తగ్గించడం ద్వారా దానిని కనబరిచారు. గత వారం రోజుల్లో ద్రవ్యోల్బణము, పారిశ్రామిక ఉత్పత్తిలకు సంబంధించి సానుకూల ఆర్ధిక ఫలితాలు వెలువడడంతో వడ్డీ తగ్గింపు ఉంటుందని అంచనా వేశారు. అలాంటి తగ్గింపు ఏదన్నా ఉన్నట్లయితే అది ఫిబ్రవరి 3 వ తేదీ నాటి ద్వైమాస విత్త విధాన సమీక్షలో…

ధనికులకు ఆర్.బి.ఐ పండగ కానుక, వడ్డీ రేటు తగ్గింపు

ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ శత పోరును ఆర్.బి.ఐ గవర్నర్ రఘురాం రాజన్ మన్నించారు. ధనికులు, కంపెనీలకు మరిన్ని రుణాలను అందుబాటులోకి తెస్తూ రెపో రేటును 8 శాతం నుండి 7.75 శాతానికి తగ్గించారు. ద్రవ్య విధానం సమీక్షతో సంబంధం లేకుండానే ఆర్.బి.ఐ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. “లిక్విడిటీ అడ్జస్ట్ మెంట్ ఫెసిలిటీ కింద పాలసీ రేపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించాలని నిర్ణయించాము. తద్వారా వడ్డీ రేటు 8 నుండి 7.75 శాతానికి…

డబ్బు ఎలా ఏర్పడింది? -ఈనాడు

డబ్బు విషయంలో కొద్దిమంది సంతృప్తిగా ఉన్నప్పటికీ అనేకమంది అసంతృప్తి ప్రకటిస్తుంటారు. జీవితంలో ఏదో ఒక క్షణంలో డబ్బుని కనిపెట్టినవాడిని పట్టుకుని తన్నాలనిపించే ఆలోచన కలిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి డబ్బు గురించి ఈ రోజు ఈనాడు పత్రికలో చర్చించబడింది. డబ్బు అంటే మనకు తెలిసింది నోట్ల కట్టలు, నాణేలు మాత్రమే. డి.డిలు, చెక్కులు, ప్రామిసరీ నోట్లు, ట్రెజరీ బిల్లులు లేదా బాండ్లు (వీటిని సావరిన్ బాండ్లు లేదా సార్వభౌమ ఋణ పత్రాలు అంటారు), బ్యాంకులు…

ఆర్.బి.ఐ లాభం రు. 53 వేల కోట్లు

2013-14 ఆర్.బి.ఐ కోశాగార సంవత్సరం (RBI fiscal year) లో భారత సెంట్రల్ బ్యాంకు రు. 52,679 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఇది గత సంవత్సరం లాభంతో పోలిస్తే 14.75 శాతం తక్కువ అని ఆర్.బి.ఐ తెలిపింది. తన లాభం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వానికి తరలిస్తున్నట్లు బ్యాంకు తెలిపింది. ఆర్.బి.ఐ కోశాగార సంవత్సరం జులైలో ప్రారంభమై జూన్ తో ముగుస్తుంది. అనగా జాతీయ ఆర్ధిక సంవత్సరం లేదా జాతీయ కోశాగార సంవత్సరం కంటే ఆర్.బి.ఐ ఆర్ధిక సంవత్సరం…

మరో ప్రపంచ ఆర్ధిక సంక్షోభం రావచ్చు -ఆర్.బి.ఐ గవర్నర్

భారత రిజర్వ్ బ్యాంకు గవర్నర్ బాంబు పేల్చారు. మరోసారి ప్రపంచ ఆర్ధిక సంక్షోభం సంభవించవచ్చని హెచ్చరించారు. ఆయన చెబుతున్నది 2008 నాటి సంక్షోభం తరహాది కూడా కాదు. ఏకంగా 1930ల నాటి మహా మాంద్యం తరహాలోనే సంక్షోభం రావచ్చని హెచ్చరించారు. 2008 నాటి సంక్షోభాన్ని ‘ద గ్రేట్ రిసెషన్’ అని పిలవగా, 1930ల నాటి సంక్షోభాన్ని ‘ద గ్రేట్ డిప్రెషన్’ గా పిలిచారు. రిసెషన్ కంటే డిప్రెషన్ మరింత లోతైన, విస్తారమైన సంక్షోభం. ఆనాటి డిప్రెషన్ నుండి…

మోడి గెలుపు: ఇక ఎఫ్.డి.ఐల వరదే -ఆసోఛామ్

నరేంద్ర మోడి ప్రచార సారధ్యంలో బి.జె.పి/ఎన్.డి.ఏ సాధించిన విజయం ధనిక వర్గాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మోడి అభివర్ణించిన ‘మంచి రోజులు’ తమకే అని వారికి బాగానే అర్ధం అయింది మరి! గుజరాత్ నమూనాను దేశం అంతా అమలు చేయడం అంటే స్వదేశీ-విదేశీ  కంపెనీలకు, పరిశ్రమలకు, దళారులకు మేలు చేస్తూ ప్రజల వనరులను వారికి కట్టబెట్టడమే అని కాంగ్రెస్ సైతం చెప్పే మాట! ఈ నేపధ్యంలో మోడి అనుసరించే విధానాల వల్ల దేశంలోకి ఈ యేడు రికార్డు స్ధాయిలో…

మోడి వస్తే ఆర్.బి.ఐ గవర్నర్ కి పదవీ గండమా?

నరేంద్ర మోడి ప్రధాని అయితే (బి.జె.పి కూటమి అధికారంలోకి వస్తే) ఆర్.బి.ఐ గవర్నర్ రఘురాం రాజన్ కి పదవీ గండం తప్పకపోవచ్చని రాయిటర్స్ వార్తా సంస్ధ నిన్న ఒక కధనం ప్రచురించింది. పదవి నుండి తప్పుకోమని అడగకపోతే కనీసం రఘురాం రాజన్ పై కంపెనీల కోసం తీవ్ర స్ధాయిలో రాజకీయ ఒత్తిడులయినా ఉంటాయని ఆ పత్రిక వివరించింది. ఆ మేరకు వివిధ కార్పొరేట్ కంపెనీల లాబీయింగ్ సంస్ధలు ఆశిస్తున్నాయనీ, కొన్నయితే ఏర్పాట్లే చేసుకుంటున్నాయని రాయిటర్స్ వివరించింది. రాయిటర్స్…

ద్రవ్య సమీక్ష: వడ్డీ రేట్లు మళ్ళీ పెంచిన ఆర్.బి.ఐ

ఆర్.బి.ఐ గవర్నర్ రఘురాం రాజన్ మరోసారి మార్కెట్ పరిశీలకులను ఆశ్చర్యపరిచారు. పరిశ్రమ వర్గాలను నిరాశపరిచారు. తాను మాత్రం ‘వినాశకర ద్రవ్యోల్బణం’ పగ్గాలు బిగించే పనిలో ఉన్నానని చెప్పారు. ద్రవ్య సమీక్షలో భాగంగా ఆయన స్వల్పకాలిక వడ్డీ రేటు ‘రెపో రేటు’ ను మరో 25 బేసిస్ పాయింట్లు పెంచి 7.75 శాతం నుండి 8 శాతానికి చేర్చారు. 2013-14 సంవత్సరంలో భారత వృద్ధి రేటు 5 శాతం కంటే తక్కువే ఉంటుందని చెప్పి ఆర్.బి.ఐ గవర్నర్ మరో…

పాత నోట్లు రద్దు చేస్తే, నల్లధనం బైటికొస్తుందా? -కార్టూన్

నల్ల ధనం వెలికి తీయడానికి ఆర్.బి.ఐ ఒక చిట్కా కనిపెట్టింది. అది, 2005కు ముందు ముద్రించబడిన కరెన్సీ నోట్లను రద్దు చేయడం. జూన్ 30, 2014 లోపు ఈ పాత నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలని ఆర్.బి.ఐ మూడు రోజుల క్రితం వినియోగదారుల కోరింది. 2005 ముందు నాటి నోట్లను ఉపసంహరించుకోవడం ఆర్.బి.ఐ చాలాకాలం క్రితమే ప్రారంభించిందని అయితే ఈ పనిని బ్యాంకుల వరకే పరిమితం చేశామని ఆర్.బి.ఐ గవర్నర్ రఘురాం రాజన్ చెప్పారు. పాత నోట్ల ఉపసంహరణ…

వడ్డీ రేటు పెంచిన ఆర్.బి.ఐ, ప్రభుత్వం కినుక

ఆర్.బి.ఐ అధినేత మారినా కూడా రిజర్వ్ బ్యాంక్, ప్రభుత్వాల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. నూతన గవర్నర్ గా రఘురాం రాజన్ నియామకాన్ని చప్పట్లతో ఆహ్వానించిన కార్పొరేట్, పరిశ్రమల వర్గాలు ఆయన వరుస పెట్టి తీసుకుంటున్న చర్యలతో మింగలేక, కక్కలేక గొణుగుడుతో సరిపెట్టుకుంటున్నారు. తాజా ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ స్వల్పకాలిక వడ్డీ రేటు (రెపో రేటు) ను మరో 25 బేసిస్ పాయింట్లు పెంచడంతో ఏమి అనలేక నిశ్శబ్దమే స్పందనగా మిగిలిపోయారు. ప్రధాన…

ఐ.ఎం.ఎఫ్ అంటే అలిగితిమి, ఆర్.బి.ఐదీ అదే మాటాయె!

భారత ఆర్ధిక వృద్ధి రేటు అంచనాను ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకు లు తగ్గించినందుకు భారత ప్రభుత్వం తీవ్ర స్ధాయిలో ఉడుక్కుంది. ఎంతగా ఉడుక్కుందంటే, అసలు ఐ.ఎం.ఎఫ్ ఆర్ధిక అంచనా పద్ధతులను మార్చిపారేయాలని మన ఆర్ధిక మంత్రి చిదంబరం నేరుగా ఐ.ఎం.ఎఫ్ (వాషింగ్టన్) సమావేశాల్లోనే డిమాండ్ చేసేంతగా. తీరా చూడబోతే మన ఆర్.బి.ఐ కూడా భారత వృద్ధి రేటును దాదాపు ప్రపంచ బ్యాంకు అంచనాకు దరిదాపుల్లోనే ఉంచింది. 2013-14 లో ఇండియా వృద్ధి రేటు 4.7 శాతం ఉంటుందని…

ద్రవ్య సమీక్ష: ధనిక వర్గాలకు కొత్త ఆర్.బి.ఐ గవర్నర్ షాక్

కొత్త ఆర్.బి.ఐ గవర్నర్ గా రఘురాం రాజన్ నియమితుడయినప్పుడు ఆయన చెప్పిన మాటల్ని బట్టి పరిశ్రమల వర్గాలు తెగ ఉబ్బిపోయాయి. ఆర్.బి.ఐ పరపతి విధానం ద్వారా తమ పరపతి ఇక ఆకాశంలో విహరించడమే తరువాయి అన్నట్లుగా ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. తీరా చర్యల విషయానికి వచ్చేసరికి బ్యాంకు వడ్డీ రేటు తగ్గించడానికి బదులు పెంచేసరికి వాళ్ళకు గట్టి షాకే తగిలింది. ఆ షాక్ ఎంత తీవ్రంగా ఉందంటే ద్రవ్య విధాన సమీక్ష ప్రకటించాక భారత స్టాక్ మార్కెట్లు…