ఆర్.బి.ఐ లాభం రు. 53 వేల కోట్లు

2013-14 ఆర్.బి.ఐ కోశాగార సంవత్సరం (RBI fiscal year) లో భారత సెంట్రల్ బ్యాంకు రు. 52,679 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఇది గత సంవత్సరం లాభంతో పోలిస్తే 14.75 శాతం తక్కువ అని ఆర్.బి.ఐ తెలిపింది. తన లాభం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వానికి తరలిస్తున్నట్లు బ్యాంకు తెలిపింది. ఆర్.బి.ఐ కోశాగార సంవత్సరం జులైలో ప్రారంభమై జూన్ తో ముగుస్తుంది. అనగా జాతీయ ఆర్ధిక సంవత్సరం లేదా జాతీయ కోశాగార సంవత్సరం కంటే ఆర్.బి.ఐ ఆర్ధిక సంవత్సరం…