సమాచార హక్కు చట్టం నుండి మరిన్ని సంస్ధల మినహాయింపు

సమాచార హక్కు చట్టం (Right to Information Act) ప్రభుత్వ విధానాల్లో, ప్రభుత్వ సంస్ధలు పనిచేస్తున్న పద్ధతుల్లో పారదర్శకతను పెంచడానికి ఉద్దేశించిన చట్టం. ఈ చట్టం 2005 లో ప్రవేశ పెట్టిన దగ్గర్నుండీ, చట్టాన్ని ఇప్పటికి అనేకసార్లు తూట్లు పొడిచారు. ప్రజలకు జవాబుదారీగా ఉండవలసిన అత్యున్నత సంస్ధలు అన్నింటినీ దీనినుండి మినహాయించారు. తాజాగా మినహాయింపుల జాబితాలో మరో మూడు సంస్ధలను కలుపుతూ కేంద్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి జూన్ 9 నే దీనికి…