కొలువిస్తామని మత మార్పిడి, హిందూ సంస్ధల ‘ఏ’కృత్యం?

హిందువులు ముస్లిం మతంలోకి మారినా, బాప్తిజం పుచ్చుకుని క్రైస్తవ మతంలోకి వెళ్ళినా ఆర్.ఎస్.ఎస్, దాని అనుబంధ సంస్ధలు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ‘లవ్ జిహాద్’ అంటూ స్వకపోల కల్పిత కుట్రలను కూడా సృష్టించి కులాతీత, మతాతీత ప్రేమ వివాహాలకు మతం రంగు పులమడం వారికి ఇష్టమైన కార్యక్రమం. అలాంటి హిందూ అతివాద సంస్ధలు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఉద్యోగాలు ఇప్పిస్తాం, ప్రభుత్వ పధకాలు ఇప్పిస్తాం, అని ఆశ చూపుతూ ముస్లింలను హిందూ మతంలోకి…

హిందూత్వ డిమాండ్లకు రాజ్యాంగ మద్దతు ఉంది -ఆర్.ఎస్.ఎస్

బి.జె.పి మొదటిసారి సొంతగా మెజారిటీ సాధించిన నేపధ్యంలో ఆ పార్టీ మాతృ సంస్ధ ఆర్.ఎస్.ఎస్ ఆశలు మోసులెత్తుతున్నాయి. హిందూత్వ డిమాండ్లను మోడి నెరవేర్చాల్సిందేనని ఆర్.ఎస్.ఎస్ అగ్రనేతలు స్పష్టం చేస్తున్నారు. బి.జె.పి మేనిఫెస్టోలో సాంస్కృతిక విభాగంలోకి నెట్టివేశామని ఎన్నికలకు ముందు చెప్పిన హిందూత్వ డిమాండ్లు ఇప్పుడు కేంద్ర స్ధానానికి తెచ్చే ప్రయత్నంలో ఆర్.ఎస్.ఎస్ ఉన్నదని సంస్ధ సిద్ధాంత కర్త ఎం.జి.వైద్య మాటల ద్వారా అర్ధం అవుతోంది. “అయోధ్యలో రామ మందిరం, ఉమ్మడి పౌర స్మృతి, ఆర్టికల్ 370 రద్దు……

పటేల్ వారసత్వం ఎవరిది? -కార్టూన్

సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్! స్వతంత్ర భారతావనికి మొట్టమొదటి హోమ్ మంత్రిగా పని చేసి అనేక స్వతంత్ర సంస్ధానాలను భారత దేశంలో విలీనం కావడంలో ముఖ్యపాత్ర పోషించాడన్న కీర్తి సంపాదించిన వ్యక్తి. ఇప్పుడు ఆయన కీర్తి ప్రతిష్టలకు వారసత్వం పొందే హక్కు ఏ రాజకీయ పార్టీది అన్న మీమాంస తలెత్తింది. కాంగ్రెసా? లేక బి.జె.పి యా? ఈ రెండింటిలో ఏది హక్కుదారు? గుజరాత్ లోని పటేల్ మెమోరియల్ ట్రస్ట్ వారు పటేల్ స్మృతిలో ప్రపంచంలోనే అతి భారీ…

మూతపడని నోళ్ళు, గీత దాటితే సీత గతేనట!

అత్యాచారాలకి వ్యతిరేకంగా అంతపెద్దఎత్తున జనం ఉద్యమించినా పురుష పుంగవుల నోళ్ళు మూతపడబోమంటున్నాయి. గీత దాటితే సీతకి పట్టిన గతే పడుతుందని బి.జె.పి నాయకుడొకరు నోరు పారేసుకుంటే, మహిళలపై అత్యాచారాలు ఇండియాలో జరుగుతున్నాయి గానీ భారత్ లో జరగడం లేదని ఆర్.ఎస్.ఎస్ సుప్రీం నాయకుడు స్పష్టం చేస్తున్నాడు. మధ్య ప్రదేశ్ బి.జె.పి మంత్రి కైలాస్ విజయ్ వర్గియా, ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ తాజాగా మహిళాలోకం ఆగ్రహాన్నీ, పౌర ప్రపంచం ఖండన మండనలను ఎదుర్కొన్నారు. “Ek…

బీహార్ పాఠశాల గ్రంధాలయాల్లొ అర్.ఎస్.ఎస్ పుస్తకాలు -జె.డి(యు) రెబెల్స్

తనను తాను అసలైన సెక్యులరిస్టుగా చెప్పుకునే నితీష్ కుమార్ బీహార్ పాఠశాలల కోసం ఆర్.ఎస్.ఎస్ సిద్ధాంతాలను బోధించే పుస్తకాలను కొనడానికి అనుమతించాడని జనతా దళ్ (యునైటెడ్) పార్టీ తిరుగుబాటు నాయకుడు ఒకరు ఆదివారం వెల్లడించాడు. మతన్మోదాన్ని, విద్వేషాలనూ రెచ్చగొట్టే ఈ పుస్తకాలను వెంటనే పాఠశాలల గ్రంధాలయాలనుండి తొలగించాలని ఆయన డిమాండ్ చేశాడు. ప్రభుత్వ నిధులను ఖర్చు చేసి ఆర్.ఎస్.ఎస్ భావాల వ్యాప్తికి దోహదం చేసే పుస్తకాలను కొనుగోలు చేసి పాఠశాల పిల్లలకు అందుబాటులో ఉంచడం తగదని ఉపేంద్ర…