డిగ్రీ వివరాలు ఇవ్వొద్దని స్మృతి కోరారు -యూనివర్సిటీ

తన చదువు వివరాలు ఆర్‌టి‌ఐ దరఖాస్తుదారుకు ఇవ్వొద్దని మానవ వనరుల శాఖ మాజీ మంత్రి, ప్రస్తుత టెక్స్ టైల్స్ శాఖ మంత్రి స్మృతి ఇరానీ తమను కోరారనీ అందుకే ఆమె డిగ్రీ వివరాలను దరఖాస్తుదారుకు ఇవ్వలేదని స్కూల్ ఆఫ్ ఓపెన్ లర్నింగ్ (ఎస్‌ఓ‌ఎల్), సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (సి‌ఐ‌సి) కు వివరణ ఇచ్చింది. మంత్రి ఒత్తిడితోనే ఇరానీ చదువు వివరాలను విద్యా సంస్ధ ఇవ్వలేదని ఈ వివరణతో స్పష్టం అవుతున్నది. స్మృతి ఇరానీ తన విద్యార్హతల వివరాలను…

నోట్ల రద్దు: ఆర్‌టి‌ఐ కింద సమాచారం నిరాకరించిన ఆర్‌బి‌ఐ

“ప్రభుత్వ అధికారులు, మంత్రులు ప్రజలకు జవాబుదారీ వహించాలి. పాలనలో పారదర్శకత పాటించాలి. అప్పుడే సుపరిపాలన అందించినట్లు” అని ప్రధాని మోడి గొప్ప గొప్ప నీతి బోధలు చేస్తారు. ఆయన నీతి బోధనలను ఆయన ప్రభుత్వమే పాటించదు. ప్రభుత్వ పారదర్శకత, జవాబుదారీతనంల కోసం ప్రవేశపెట్టిన సమాచార హక్కు చట్టాన్ని ప్రభుత్వ సంస్ధలే గౌరవించవు. కోట్లాది మంది ప్రజల కష్టార్జితాన్ని రాత్రికి రాత్రి రద్దు చేసి, రోడ్ల మీదికి నెట్టి, చివరికి రద్దు చేసిన నోట్లు కలిగి ఉన్నందుకు వారిని…

మోడి పాస్ పోర్ట్: యశోదాబెన్ ఆర్‌టి‌ఐ దరఖాస్తు

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తన భార్యగా ఎన్నికల నామినేషన్ పత్రాల్లో పేర్కొన్న శ్రీమతి యశోదా బెన్ కు తమ పెళ్లి నిజంగానే జరిగిందని రుజువు చేసుకోవాల్సిన అవసరం వచ్చిపడింది. శ్రీమతి యశోదా బెన్ ను తన భార్యగా ప్రధాన మంత్రి పేర్కొన్న సంగతి పత్రికల ద్వారా తెలియడమే. అంతే తప్ప వాస్తవంగా పెళ్ళి జరిగిందని రుజువు చేసే రికార్డులు శ్రీమతి యశోదా బెన్ వద్ద లేవని ఆమెకు ఎదురయిన తాజా పరిస్ధితి ద్వారా అర్ధం అవుతున్నది.…