క్యాష్ తగినంత లేదు, మరిన్ని రోజులు తిప్పలే -బ్యాంకులు
“నోట్లు తగినంతగా నిల్వ ఉన్నాయి. జనం ఆందోళన చెందవద్దు. ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం” అని ఓ పక్క ప్రధాని, ఆర్ధిక మంత్రి, బ్యూరోక్రాట్ అధికారులు హామీలు గుప్పిస్తున్నారు. “క్యూలు తగ్గిపోయాయి, ఇక పరిస్ధితి మెరుగుపడినట్లే” అని ఆర్ధిక మంత్రి సంతోషం కూడా ప్రకటించారు. కానీ వాస్తవం అందుకు విరుద్ధంగా ఉన్నదని పత్రికల సర్వేలు తెలియజేస్తున్నాయి. మరీ ముఖ్యంగా బ్యాంకులు కూడా అదే చెబుతున్నాయి. అనేక చోట్ల బ్యాంకులు, ఎటిఎం లలో కొత్త కరెన్సీ నోట్ల రాబడి…