యూరో జోన్ వడ్డీ రేటు ఇప్పుడు 0.05 శాతం

ఐరోపా సంక్షోభ తీవ్రతను తెలియజేస్తూ 17 దేశాల యూరోజోన్ కూటమి వడ్డీ రేటును మళ్ళీ తగ్గించారు. ఆగస్టు ప్రారంభంలో 0.25 శాతం ఉన్న వడ్డీ రేటును 0.15 శాతానికి తగ్గించిన యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు ఇప్పుడు దానిని కూడా తగ్గించి 0.05 శాతానికి చేర్చింది. ఇంత తక్కువ వడ్డీ రేటు బహుశా ప్రపంచం ఎరిగి ఉండదు. సెంట్రల్ బ్యాంకు/రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేటు తగ్గిస్తే ఆ మేరకు బ్యాంకులకు, తద్వారా కంపెనీలకు మరిన్ని నిధులు అందుబాటులోకి వస్తాయి.…