మాంద్యం వైపుకి జర్మనీ నడక, రష్యా ఆంక్షల ఫలితం!

తప్పుడు ఆరోపణలు చేస్తూ రష్యాపై అమెరికా, ఐరోపాలు విధించిన ఆంక్షలు తిరిగి వాటి మెడకే చుట్టుకుంటున్నాయి. 2014 సంవత్సరంలో రెండవ త్రైమాసికం (ఏప్రిల్, మే, జూన్) లో ఇప్పటికే జి.డి.పి సంకోచాన్ని నమోదు చేసిన జర్మనీలో ఆగస్టు నెలలో పారిశ్రామిక ఉత్పత్తి మళ్ళీ సంకోచించింది. అనగా పారిశ్రామిక ఉత్పత్తి క్రితం నెలతో పోల్చితే వృద్ధి చెందడానికి బదులు కుచించుకుపోయింది. జర్మనీ ఆగస్టు వ్యాపార ఫలితాలు వెలువడిన వెంటనే అమెరికా, ఐరోపా దేశాల స్టాక్ మార్కెట్ లు నష్టాల్లోకి…

మరోసారి క్షీణించిన జి.డి.పి, తీవ్ర రిసెషన్ లో బ్రిటన్

వరుసగా మూడో క్వార్టర్ లో కూడా బ్రిటన్ స్ధూల దేశీయోత్పత్తి (జి.డి.పి) పడిపోయింది. గత సంవత్సరం చివరి క్వార్టర్ (అక్టోబర్, నవంబర్, డిసెంబర్) లో ప్రారంభం అయిన బ్రిటన్ జి.డి.పి పతనం ఈ సంవత్సరం మొదటి క్వార్టర్ (జనవరి, ఫిబ్రవరి, మార్చి) లో కూడా కొనసాగడంతో బ్రిటన్ అధికారికంగా రిసెషన్ (మాంద్యం) లోకి జారుకున్నట్లయింది. ఈ పతనం వరుసగా ఈ సంవత్సరం రెండో క్వార్టర్ లో కొనసాగి మునుపటి కంటే ఎక్కువగా నెగిటివ్ జి.డి.పి వృద్ధి నమోదు…

నిరుద్యోగంతో తల్లిదండ్రుల చెంత చేరుతున్న అమెరికా యువత -కార్టూన్లు

స్కూల్ విద్య ముగియడంతోనే తల్లిదండ్రులను వదిలి సొంత కాళ్లపై నిలబడడానికి ప్రయత్నించే అమెరికా యువత ఇప్పుడు తన తీరు మార్చుకుంటోంది. బలహీన ఆర్ధిక వ్యవస్ధ సృష్టించిన సమస్యల సాగరాన్ని ఈదలేక స్వయం శక్తితో జీవనం గడిపే ఆలోచనలను విరమించుకుని తల్లిదండ్రుల తోడిదే లోకంగా సమాధానం చెప్పుకుంటున్నాడు. తల్లిదండ్రుల చెంతకు చేరడాన్ని వారేమీ సిగ్గుపడక, తల్లిదండ్రులతో సహజీవనాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లు అమెరికా యువకులు చెబుతున్నారని  “ప్యూ రీసెర్చ్ సెంటర్” జరిపిన సర్వే లో వెల్లడయింది. అమెరికా ఆర్ధిక మాంధ్యం…

బ్రిటన్ పొదుపు విధానాలతో కుచించుకుపోయిన కుటుంబ బడ్జెట్లు

కొన్ని వందల బిలియన్ల పౌండ్లు అప్పు తెచ్చి బెయిలౌట్ల రూపంలో ప్రవేటు ద్రవ్య సంస్దలను మేపిన బ్రిటన్ ప్రభుత్వం తీరా ఆ అప్పులను తీర్చడానికి ప్రజల పైన భారం వేస్తూ పొదుపు ఆర్ధిక విధానాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మితవాద కూటమి ఆధ్వర్యంలో నడుస్తున్న బ్రిటిష్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక పెట్టుబడిదారీ అనుకూల పొదుపు విధానాల అమలు ప్రభావం బ్రిటిష్ పౌరుల కుటుంబ బడ్జెట్‌లను బాగా కుచించివేసిందని ‘ఇనిస్టిట్యూట్ ఫర్ ఫిస్కల్ స్టడీస్’ చేసిన అధ్యయనంలో…

అమెరికా కంపెనీలు లాభాల్లో, అమెరికా ఆర్ధిక వ్యవస్ధ నష్టాల్లో

2007-08 ప్రపంచ ఆర్ధిక సంక్షోభం ఫలితంగా అమెరికా ఆర్ధిక వ్యవస్ధ తీవ్రంగా దెబ్బతింది. 2009 వరకూ అమెరికాలోని కంపెనీలు కూడా తీవ్రమైన ఆర్ధిక కష్టాల్లో ఉన్నట్లు ప్రకటించాయి. లేమేన్ లాంటి ఫైనాన్సి దిగ్గజం నిట్ట నిలువునా కూలిపోవడంతో ప్రపంచం నిర్ఘాంతపోయింది. వాల్ స్ట్రీట్ లోని బహుళజాతి ద్రవ్య సంస్ధలైన ఇన్‌వెస్ట్‌మెంట్ బ్యాంకులన్నీ తోటి బ్యాంకులపై నమ్మకం కోల్పోయి ఒక్క సెంటు కూడా చేబదుళ్ళు, అప్పులు ఇవ్వడానికి నిరాకరించడంతో అప్పు దొరకడం గగనమైంది. “క్రెడిట్ క్రంచ్” గా పేర్కొన్న…

ఐ.ఎం.ఎఫ్, ఇ.యుల బెయిలౌట్‌తో రిసెషన్‌లోకి జారనున్న పోర్చుగల్

గ్రీసు, ఐర్లండ్‌ దేశాల తర్వాత పోర్చుగల్ అప్పు సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి విదితమే. ఐ.ఎం.ఎఫ్, యూరోపియన్ యూనియన్‌లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఆర్ధిక సహాయ నిధి నుండి బెయిలౌట్ ప్యాకేజి పొందే అవసరం లేదని పోర్చుగల్ మొదట చెప్పినప్పటికీ, పార్లమెంటులో బడ్జెట్ బిల్లు ఓడిపోయి ప్రభుత్వం కూలిపోవడంతో బాండ్ మార్కెట్లో పోర్చుగల్ సావరిన్ అప్పుపై వడ్డీ పెరిగిపోయి అప్పు సేకరించడం అసాధ్యంగా మారిపోయింది. దానితో అనివార్యంగా పోర్చుగల్ ఆపద్ధర్మ ప్రధాని జోస్ సోక్రటీసు గత నెల ప్రారంభంలో…