క్లుప్తంగా… 14.05.2012

జాతీయం పార్లమెంటుకి 60 సంవత్సరాలు భారత పార్లమెంటు సమావేశమై ఆదివారం (మే 13) తో 60 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పార్లమెంటు ఆదివారం ప్రత్యేకంగా సమావేశం జరిపింది. రాజ్య సభ లో ప్రధాని మన్మోహన్, లోక్ సభలో ఆర్ధిక మంత్రి ప్రణబ్ చర్చ ప్రారభించారు. పార్లమెంటులో పదే పదే అవాంఛనీయ సంఘటనలు జరగడం పట్ల ప్రధాని ఆందోళన వెలిబుచ్చాడు. “సమావేశాలకు ప్రతిరోజూ ఆటంకాలు ఎదురు కోవడం, వాయిదాలు పడడం, కేకలు వేయడం వల్ల బైటి వారికి…

క్లుప్తంగా… 12.05.2012

మార్చిలో 3.5 % క్షీణించిన పారిశ్రామిక ఉత్పత్తి అమెరికా సైనికులకు ‘ఇస్లాం’ వ్యతిరేక పాఠాలు వియత్నాం యుద్ధ ఫోటోగ్రాఫర్ ‘హార్స్ట్ ఫాస్’ మరణం జాతీయం మార్చిలో 3.5 % క్షీణించిన పారిశ్రామిక ఉత్పత్తి భారత దేశ పారిశ్రామిక ఉత్పత్తి సూచి (ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ -ఐ.ఐ.పి) మరో సారి నిరాశ కలిగించింది. మార్చి 2012 నెలలో పెరగకపోగా తగ్గిపోయింది. -3.5 శాతం వృద్ధి నమోదు చేసింది. అధిక ద్రవ్యోల్బణం, పెరుగుతున్న కరెంట్ ఖాతా లోటు, రూపాయి…

ఈసారీ సకాలంలోనే ఋతుపవనాలు -ఐ.ఎం.డి

ఈ సంవత్సరం కూడా సకాలంలోనే జూన్ 1, 2012 తేదీనే ఋతుపవనాలు దేశంలో ప్రవేశించనున్నాయని ‘ఇండియన్ మీటియోరోలాజికల్ డిపార్ట్ మెంట్’ మంగళవారం ప్రకటించింది. దక్షిణ అండమాన్ సముద్రంలో ఋతుపవనాలు ప్రవేశించడం దాదాపు ఖాయమయిందనీ తెలిపింది. ప్రతి యేటా మే 20 న దక్షిణ అండమాన్ సముద్రంలో ప్రవేశించే నైరుతి ఋతుపవనాలు అనంతరం జూన్ 1 తేదీన కేరళ తీరాన్ని తాకడం ద్వారా దేశంలోని ప్రధాన భూభాగంలోకి ప్రవేశిస్తాయి. రైతులు వ్యవసాయం కోసం ప్రధానంగా వర్షాలపై ఆధారపడే భారత…

ప్రజాందోళనలు అణచివేసేందుకు సైన్యాన్ని దించుతాం -ఇటలీ

దేశంలో జరుగుతున్న ప్రజాందోళనలను అణచివేయడానికి సైన్యాన్ని దించక తప్పదని ఇటలీ ప్రధాని ‘మేరియో మోంటి’ ప్రకటించాడు. ప్రభుత్వ ఆర్ధిక విధానాలపై ఇటలీ ప్రజలు కొన్ని సంవత్సరాలుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ ఆందోళనలు తీవ్రం అయ్యాయి. ఐ.ఎం.ఎఫ్, ఇ.యు ల ఒత్తిడితో యూరోపియన్ దేశాలు పొదుపు విధానాలు అమలు చేస్తుండడంతో అక్కడ నిరుద్యోగం పెరిగిపోయి సామాజిక సమస్యలు తీవ్రం అయ్యాయి. వినాశకర ఆర్ధిక విధానాలు అమలు చేయడం ఆపాలని ప్రజలు కోరుతుండగా వారి మొర ఆలకింకడానికి…

‘పొదుపు విధానాల’ పై ఇటాలియన్ల సమ్మె

ఇటలీ నగరంలో పొదుపు విధానాలను వ్యతిరేకిస్తున్న కార్మికులు, విద్యార్ధులపైన పోలీసులు నిర్బంధం ప్రయోగించారు. దక్షిణ ఇటలీ నగరం నేపుల్స్ లో పోలీసులు, ప్రజల ఘర్షణలు తీవ్ర స్ధాయిలో జరిగాయని ప్రెస్ టి.వి తెలిపింది. ప్రభుత్వ పన్నుల విధానాలతో ఆగ్రహం చెందిన కార్మికులు, విద్యార్ధులు పన్నుల కార్యాలాయం ముందు ఆందోళన నిర్వహించారు. పోలీసులు లాఠీ ఛార్జీ చేసి ప్రదర్శకులను తరిమివేయడానికి ప్రయత్నించడంతో ప్రదర్శకులపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. దానితో విద్యార్ధులు కార్మికులు పోలీసులపై బాటిళ్ళు, కోడిగుడ్లు విసిరారని పత్రికలు…

క్లుప్తంగా… 09.05.2012

జాతీయం పరువు హత్యలకు యు.పి డి.ఐ.జి మద్దతు తన కూతురు ఇంటి నుండి పారిపోయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుందనీ, అబ్బాయిపై చర్య తీసుకోవాలనీ ఫిర్యాదు చేసిన వ్యక్తికి కూతురిని చంపెయ్యమని అత్యున్నత పోలీసు అధికారి సలహా ఇవ్వడం సంచలనం రేపింది. తండ్రి స్ధానంలో తానున్నట్లయితే కూతురిని చంపేయ్యడమో లేదా తానే ఆత్మహత్య చేసుకోవడమో చేసేవాడినని సలహా ఇస్తుండగా సంభాషణను కేమెరాలు బంధించడంతో డి.ఐ.జి ఎస్.కె.మాధుర్ వ్యవహారం లోకానికి వెల్లడయింది. రెగ్యులర్ చెకింగ్ కోసం ఓ పోలీసు…

క్లుప్తంగా… 08.05.202

జాతీయం జ్యువెలర్స్ పన్ను ఉపసంహరించిన ప్రణబ్ నగల వ్యాపారుల ఒత్తిడికి ఆర్ధిక మంత్రి తలొగ్గాడు. జ్యువెలర్స్ వ్యాపారుల తరపున తీవ్ర స్ధాయిలో జరిగిన లాబీయింగ్ ముందు చేతులెత్తేశాడు. బ్రాండెడ్ మరియు అన్ బ్రాండెడ్ నగల దిగుమతులపై పెంచిన 1 శాతం పన్ను ఉపసంహరించుకున్నాడు. పన్ను ఉపసంహరణతో పాటు పన్ను పెంపు ప్రతిపాదిస్తూ చేసిన అనేక చర్యలను సరళీకరించాడని పత్రికలు తెలిపాయి. జ్యూవెలరీ రంగంలో విదేశీ పెట్టుబడుల ఆహ్వానాన్ని మరో సంవత్సరం పాటు వాయిదా వేసుకున్నట్లు కూడా తెలుస్తోంది.…

భారత ప్రజల ఆయిల్ ప్రయోజనాలు దెబ్బ తీయనున్న క్లింటన్ పర్యటన

ఆది, సోమ వారాల్లో ఇండియా పర్యటించనున్న అమెరికా విదేశీ మంత్రి హిల్లరీ క్లింటన్ భారత ప్రజల ఇంధన ప్రయోజనాలను గట్టి దెబ్బ తీయనుంది. తన పర్యటన సందర్భంగా ఇరాన్ నుండి ఆయిల్ దిగుమతులు మరింత తగ్గించుకోవాలని హిల్లరీ భారత ప్రభుత్వంపై ఒత్తిడి చేయనుందని క్లింటన్ సహాయకులు చెప్పారు. అమెరికా ఒత్తిడితో ఇరాన్ గ్యాస్ పైప్ లైన్ ఒప్పందాన్ని రద్దు చేస్తుకున్న భారత ప్రభుత్వం అమెరికా మంత్రి ఒత్తిడికి లోగిపోదన్న గ్యారంటీ లేదు. ప్రపంచ ఆయిల్ ధరలతో పోలిస్తే…

‘నీరు, అడవి, భూమి’ ల యజమానులు ఎవరన్నదే మావోయిస్టు సమస్య -బి.డి.శర్మ

గిరిజన ప్రాంతాల్లో “జల్, జంగిల్, జమీన్” యజమానులు ఎవరన్నదే మావోయిస్టులు, ప్రభుత్వం మధ్య ఉన్న ప్రధాన సమస్య అని మాజీ జిల్లా మేజిస్ట్రేట్ బి.డి.శర్మ అన్నారు. ఛత్తీస్ ఘర్ లో కిడ్నాపయిన కలెక్టర్ అలెక్స్ పాల్ మీనన్ విడుదల కోసం మధ్యవర్తిత్వం వహించి బి.డి.శర్మ సఫలం అయ్యారు. న్యూఢిల్లీలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ బి.డి.శర్మ ఖనిజ సంపదలున్న భూములకు యజమానులైన గిరిజనులపైన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వారి ప్రయోజనాలకు వ్యతిరేకమైన అభివృద్ధి నమూనాను బలవంతంగా రుద్దుతున్నాయని, సమస్యకు…

క్లుప్తంగా… 03.05.2012

జాతీయం బెంగాల్ ప్రజలు అడుక్కునేవాళ్ళు కాదు –మమత లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం తీసుకున్న అప్పులపై మూడేళ్లు వడ్డీ చెల్లింపులు నిషేధించాలని తాను చేసిన డిమాండ్ ని కేంద్రం పట్టించుకోకపోవడం పై మమత ఆగ్రహం వ్యక్తం చేసీంది. ఈ విషయంలో తన బాధ్యతను కేంద్రం విస్మరించడానికి వీల్లేదని, బెంగాల్ ప్రజలేమీ అడుక్కోవడం లేదనీ మమత బెనర్జీ వ్యాఖ్యానించింది. తాము ప్రత్యేక ప్యాకేజీ అడగడం లేదనీ అది వారు ఇచ్చిన హామీయే కనుక దాన్ని నెరవేర్చాలనీ కోరింది. “2000 నుండి…

అనగనగా దుబాయ్ లో… ఫొటోలు

దుబాయ్ ఇప్పుడొక కాస్మోపాలిటన్ ఒయాసిస్సు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవంతి ‘బర్జ్ ఖలీఫా’ దుబాయ్ లోనే ఉంది. అత్యంత విలాసవంతమయిన టూరిస్టు కేంద్రంగా దుబాయ్ భాసిల్లుతోంది. సొమ్ములు అనంతంగా పోగుపడిన వారు వాటిని త్వర త్వరగా ఖర్చు చేసుకోవడానికి దుబాయ్ సందర్శిస్తే సరిపోతుంది. అక్రమ సంపాదనను పెట్టుబడులు పెట్టుడానికీ, అక్రమ డబ్బుని దాచుకోవడానికి దుబాయ్ వీలు కల్పిస్తుంది. ఇది ఇప్పటి సంగతి. ఇరవై, ముప్ఫై యేళ్ల క్రితం దుబాయ్ పరిస్ధితి ఇది కాదు. పెట్రో డాలర్లు ముంచెత్తి…

రూపాయి విలువ పడిపోవడానికి యూరోపే కారణం -ఆర్ధిక మంత్రి

గత కొద్ది నెలలుగా రూపాయి విలువ 15 శాతం పైగా పడిపోవడానికి కారణం యూరో జోన్ లోని వ్యవస్ధాగత సమస్యలేనని ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తేల్చేశాడు. రూపాయి విలువ ఎన్నడూ లేనంతగా పతనం అవుతుండడంతో దేశ దిగుమతుల బిల్లు తడిసి మోపెడయింది. యూరోజోన్ ఋణ సంక్షోభంతో పాటు కమోడీటీల ధరలు, ముఖ్యంగా ఆయిల్ ధరలు అస్ధిరంగా మారడంతో ఇండియాతో పాటు ఇతర ఆసియా దేశాల్లో ‘చెల్లింపుల సమతూకం’ (Balance of Payment) ఒత్తిడికి గురవుతోందని ప్రణబ్…

స్పెయిన్ ఆయిల్ కంపెనీని జాతీయ చేసిన అర్జెంటీనా

– “ఇప్పటి నుండి మన ఆయిల్ రెస్పోల్ కంపెనీ అమ్ముకునే కమోడిటీ గా ఉనికిని ముగించుకుని దేశ అభివృద్ధి కోసం మౌలిక సరుకుగా ఉపయోగపడుతుంది”      -అర్జెంటీనా పాలక పార్టీ పార్లమెంటు సభ్యుడు ఆగస్టిన్ రొస్సీ అర్జెంటీనాలో అతి పెద్ద ఆయిల్ కంపెనీ వై.పి.ఎఫ్ ను ప్రభుత్వం జాతీయ చేసింది. వాణిజ్య ఆంక్షలు విధిస్తామన్న యూరోపియన్ యూనియన్ హెచ్చరికలను పెడచెవిన పెడుతూ, అర్జెంటీనా పార్లమెంటు అత్యధిక మెజారిటీతో వై.పి.ఎఫ్ జాతీయ కరణను ఆమోదించింది. వై.పి.ఎఫ్ లో స్పెయిన్ బహుళజాతి…

క్లుప్తంగా… 02.05.2012

జాతీయం   రిలయన్స్ ని అధిగమించిన టాటా కన్సల్టెన్సీ బుధవారం షేర్ మార్కెట్లు ముగిసేనాటికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీ (టి.సి.ఎస్) అత్యధిక విలువ గల కంపెనీగా అవతరించింది. ‘మార్కెట్ క్యాపిటలైజేషన్’ ప్రకారం ఇప్పుడు టి.సి.ఎస్ అతి పెద్ద కంపెనీ. గత అయియిదేళ్లుగా రిలయన్స్ కంపెనీ ఈ స్ధానంలో కొనసాగుతూ వచ్చింది. బుధవారం ట్రేడ్ ముగిసేనాటికి టి.సి.ఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రు. 2,48,116 కోట్లు కాగా, రిలయన్స్ మార్కెట్ క్యాప్ రు. 2,43,413 కోట్లు. బుధవారం ఆర్.ఐ.ఎల్…