కాశ్మీర్ లో వింత ప్రభుత్వం -కార్టూన్

ఎన్నికలు జరిగిన 2 నెలలకు గాని జమ్ము & కాశ్మీర్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడలేదు. రాష్ట్ర ప్రజలు ఏ పార్టీకి మెజారిటీ ఇవ్వకపోవడంతో, ముఖ్యంగా సెక్యులర్ ముద్ర కలిగిన కాంగ్రెస్ ప్రభ పడిపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు విపత్కరమైన ఆటంకాలు ఎదురయ్యాయి. ఈ ఆటంకాలే కారణం అవునో కాదో ఇదమిద్ధంగా చెప్పలేం గానీ, ఓ వింత ప్రభుత్వం ఏర్పడిందన్న ఆలోచన మాత్రం పలువురికి కలుగుతోంది. వింత ప్రభుత్వం అనడం ఎందుకంటే ‘ఒక అంగీకారానికి వచ్చాం, కనీస ఉమ్మడి కార్యక్రమం…

ఆర్టికల్ 370పై చర్చ: వేటగాడి వల?

ఆర్టికల్ 370 మరోసారి చర్చలోకి వస్తోంది. ఆ చర్చను కొత్తగా అధికారం చేపట్టిన కేంద్ర ప్రభుత్వమే ప్రేరేపిస్తోంది. జమ్ము & కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించేందుకు ఉద్దేశించిన ఈ ఆర్టికల్ నిజానికి జీవత్ శవంతో సమానం. ఎన్నికల ప్రచారం సందర్భంగానే ఆర్టికల్ 370 పైన చర్చ జరగాలని ప్రతిపాదించిన నరేంద్ర మోడి అన్నివైపుల నుండి విమర్శలు రావడంతో కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపించారు. తాజాగా ప్రధాన మంత్రి కార్యాలయంలో సహాయ మంత్రిగా నియమితులయిన జితేంద్ర సింగ్…

ప్రశ్న: ఆర్టికల్ 370 కాశ్మీర్ కి అవసరమా?

ఉమేష్ పాటిల్: ఆర్టికల్ 370 గురించి వివరించండి. కాశ్మీర్ కి అది అవసరమా? సమాధానం: జమ్ము & కాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు ఉద్దేశించినదే ఆర్టికల్ 370. 1949 నుండి ఇది ఉనికిలో ఉన్నప్పటికీ ఈ ఆర్టికల్ నిజంగా ఊపిరి పీల్చుకుని సజీవంగా నిలిచిన రోజులు మాత్రం చాలా తక్కువే. వివిధ ఒప్పందాల పేరుతోనూ, రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారానూ ఈ ఆర్టికల్ ద్వారా కాశ్మీర్ కు కల్పించిన అధికారాలు అన్నింటిని కత్తిరించేశారు. ఆర్టికల్ 370 జీవచ్ఛవంగా…