ప్రశ్న: ఆర్కిటిక్ సంపదలో ఇండియాకు భాగం ఎలా?

మూల: అర్కిటిక్ రిజియన్లో మనదేశానికి భాగంలేనందున ఆ రిజియన్లో మన ప్రయత్నాలు పరోక్షపద్దతులవలననే అర్ధం అవుతోంది!!మరిదానికి సహకరించేది రష్యానా? లేక వేరేదైనా? సమాధానం: ఈ అంశాన్ని గతంలో రెండు ఆర్టికల్స్ లో వివరించాను. వాటికి లంకెలు కింద ఇస్తున్నాను. ఆర్కిటిక్ సంపదలను వివాదరహితంగా పరిష్కరించుకునేందుకు వీలుగా ఆర్కిటిక్ దేశాలు కలిసి ‘ఆర్కిటిక్ కౌన్సిల్’ అనే సంఘం ఏర్పాటు చేసుకున్నాయి. ఇందులో 8 శాశ్వత సభ్య దేశాలు ఉన్నాయి. ఇతర దేశాలు కూడా ఇందులో చేరవచ్చు. కానీ ప్రస్తుతానికి…

కరుగుతున్న ఆర్కిటిక్, చమురు సంపదలో ఇండియాకీ వాటా?

భూ గ్రహం ఉత్తర ధ్రువం అయిన ఆర్కిటిక్ ఖండం వద్ద మంచు గడ్డలు వేగంగా కరిగిపోతున్నాయి. దానితో ఆ ఖండం వద్ద దాగిన అపార ఖనిజ, చమురు వనరుల కోసం పోటీ పేరుగుతోంది. ఈ పోటీలో భారత దేశం కూడా ప్రవేశించిన పరిణామం చోటు చేసుకుంది. ‘ఆర్కిటిక్ కౌన్సిల్’ లో సభ్యత్వం కోసం ప్రయత్నిస్తూ వచ్చిన ఇండియాకు ‘పరిశీలక’ హోదా ఇస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఇండియా, చైనాలతో పాటు ఆరు దేశాలకు ఈ హోదా…