దేశం దృష్టికి రాని ఆరేళ్ళ నిర్భయ

నిర్భయపై అత్యాచారం చేసిన ఆరుగురిలో ఒకరైన బాల నేరస్ధుడిని విడుదల చేసినందుకు ప్రస్తుతం దేశ్యవ్యాపితంగా అనేకమంది ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఆరుగురిలో నిర్భయ పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరించింది బాల నేరస్ధుడే అన్న అభిప్రాయం మొదటి నుండీ వ్యాపించి ఉండడంతో అతన్ని వదిలిపెట్టడం పట్ల ఆగ్రహం తీవ్రంగా వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా నిర్భయ తల్లిదండ్రులు బాల నేరస్ధుడు విడుదల కానున్నాడన్న నిజాన్ని తట్టుకోలేక నిద్ర లేని రాత్రులు గడుపుతూ తీవ్ర ఆగ్రహం ప్రకటిస్తున్నారు. తమకు అన్యాయం జరిగిందని…