ఎఎపి పరిస్ధితి ఇక ఇదేనా? -కార్టూన్
సామాన్యుడిని నెత్తి మీద పెట్టుకుంటానని ఉనికిలోకి వచ్చిన ఆం ఆద్మీ పార్టీ ఢిల్లీ జనాన్ని బాగానే ఆకట్టుకుంది. కానీ అనతికాలం లోనే జనంలో పలుకుబడి కోల్పోయిందని లోక్ సభ ఎన్నికలు రుజువు చేసినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఢిల్లీ పీఠాన్ని కట్టబెట్టడం ద్వారా ప్రజలు పెట్టుకున్న ఆశల్ని తగిన విధంగా ఆచరణలోకి తేవడంలో ఆ పార్టీ విఫలమైందని అందుకే ప్రజల్లో పలచన అయిందని వారి అవగాహన. అధికారంలోకి వచ్చీ రావడంతోనే సంచలన కార్యక్రమాలకు తెరతీసిందని సో కాల్డ్ మర్యాదస్తులు,…