అమెరికా డ్రోన్ విమానదాడిలో మరో 25 మంది పాక్ పౌరుల దుర్మరణం

పాక్, ఆఫ్ఘనిస్ధాన్ సరిహద్దులోని నార్త్ వజీరిస్తాన్ రాష్ట్రంలో అమెరికాకి చెందిన డ్రోన్ విమానం దాడిలో మరో పాతిక మంది దుర్మరణం చెందారు. డ్రోన్ విమానదాడులకు తాను భాధ్యురాలిగా అమెరికా సాధారణంగా ధృవీకరించదు. కాని ఈ ప్రాంతంలో డ్రోన్ విమానాలు ఒక్క అమెరికాకి తప్ప మరొక దేశానికి లేవు. ప్రారంభంలో డ్రోన్ దాడులు కొన్నింటికి భాధ్యత తనదిగా పేర్కొన్నప్పటికీ, ఇటీవల కాలంలో అటువంటి ప్రకటనలు రావడం లేదు. డ్రోన్ విమాన దాడుల్లో వందల కొద్దీ పాకిస్తాన్ పౌరులు చనిపోతుండడంతో…