మహిళలకు ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో పాక్ మూడోది, ఇండియా నాలుగోది
ప్రపంచంలో మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశాలు ఏవి? రాయిటర్స్ వార్తా సంస్ధ అనుబంధంగా ఉండే ట్రస్ట్లా అనే సంస్ధ ఈ ప్రశ్నలకు సమాధానం కనుక్కోవడానికి సర్వే చేసింది. ఇది అవినీతి వ్యతిరేక అంశాలు (anti-corruption issues), సమర్ధ పాలన (good governance), మహిళల హక్కుల (women rights) అంశాలపై ప్రపంచ స్ధాయిలో ఉచితంగా వార్తలు, సమాచారం, న్యాయ సలహాలు అందించే సంస్ధ. ధామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్ దీన్ని నడుపుతోంది. మహిళలకు సంబంధించిన ఆరు అంశాలపై ఇది ప్రపంచ…