అమెరికా ప్రతీకారం: కరెన్సీ సమస్యతో అల్లాడుతున్న ఆఫ్ఘన్ ప్రజలు

తాలిబాన్ పాలనపై అమెరికా పాల్పడుతున్న ప్రతీకార చర్యలు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలను తీవ్ర సంక్షోభం లోకి నెట్టివేస్తున్నాయి. పశ్చిమ దేశాల నుండి ఇప్పటిదాకా అందుతూ వచ్చిన సహాయాన్ని నిలిపివేయడంతో పాటు ఆఫ్ఘన్ దేశానికి చెందిన సెంట్రల్ రిజర్వ్ బ్యాంకు రిజర్వు నిధులను కూడా అందకుండా నిషేధం విధించడంతో ఉన్నత స్ధాయీ ప్రభుత్వాధికారుల నుండి అత్యంత కడపటి పౌరుడు సైతం తిండికి, ఇతర కనీస సౌకర్యాలకు కటకటలాడుతున్నారు. తాలిబాన్ డబ్బు సమస్య ప్రధానంగా అమెరికా ట్రెజరీ విభాగం స్తంభింపజేసిన ఆఫ్ఘన్…

అమెరికా గొంతెమ్మ కోర్కెలకు కర్జాయ్ ససేమిరా

దశాబ్దం పైగా ఆఫ్ఘనిస్తాన్ లో తలదూర్చి ఇల్లూ, ఒల్లూ గుల్ల చేసుకున్నా తగిన ఫలితం దక్కని పరిస్ధితిని అమెరికా ఎదుర్కొంటోంది. ఇరాక్ లో వలెనే ఆఫ్ఘనిస్ధాన్ నుండి కూడా తమ బలగాలు పూర్తిగా ఉపసంహరించుకోవలసిన అగత్యం అమెరికా ముందు నిలిచింది. అమెరికా గొంతెమ్మ కోర్కెలను ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ససేమిరా నిరాకరించడమే దానికి కారణం. ఆఫ్ఘన్ ఇళ్ళల్లో చొరబడి దాడులు చేసే అధికారం ఇవ్వాలనీ, ఆఫ్ఘన్ చట్టాల నుండి అమెరికా సాయినికులకు మినహాయింపు ఇవ్వాలని అమెరికా…

ఇండియాకు తాలిబాన్ నుండి అనూహ్య ప్రశంసలు

భారత పాలకులకు ఆఫ్ఘన్ తాలిబాన్ నుండి అనూహ్య రీతిలో ప్రశంసలు లభించాయి. ఆఫ్ఘనిస్ధాన్ లో మిలట్రీ పరంగా జోక్యం చేసుకోవాలన్న అమెరికా ఒత్తిడిని భారత్ సమర్ధవంతంగా ప్రతిఘటించిందని తాలిబాన్ కొనియాడింది. అమెరికా డిఫెన్స్ సెక్రటరీ లియోన్ పెనెట్టా ను భారత్ ఒట్టి చేతులతో పంపి మంచిపని చేసిందని ప్రశంసించింది. స్వేచ్ఛా, స్వాతంత్ర్యాల కోసం పరితపిస్తున్న ఆఫ్ఘన్ ప్రజల ఆకాంక్షలకు భారత్ విలువ ఇచ్చిందనీ, అమెరికా ఒత్తిడికి లొంగి ఆఫ్ఘన్ ఆపదలోకి భారత్ ను నెట్టకుండా విచక్షణ చూపారని…

ఆఫ్ఘన్ ఫ్రెంచి బలగాలన్నీ ముందే ఉపసంహరణ

ఆఫ్ఘనిస్ధాన్ లో ఉన్న తమ యుద్ధ బలగం (combat troops) అంతటినీ సంవత్సరం ముందే ఉపసంహరించుకోవడానికి నిర్ణయించినట్లు ఫ్రాన్సు కొత్త అధ్యక్షుడు ‘ఫ్రాంకోయిస్ హాలండే’ ప్రకటించాడు. ఒక రోజు సందర్శన కోసం ఆఫ్ఘనిస్ధాన్ వచ్చిన హాలండే, ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ తో కలిసి విలేఖరుల సమావేశంలో ప్రసంగిస్తూ ఈ ప్రకటన చేశాడు. ఆఫ్ఘన్ నుండి ఫ్రెంచి బలగాల ఉపసంహరణ హాలండే ఎన్నికల వాగ్దానాల్లో ఒకటి. ఈ వారం చికాగోలో జరిగిన నాటో సమావేశాల్లోనే తన ఉద్దేశ్యం…

ఆఫ్ఘనిస్ధాన్ నుండి ఫ్రాన్సు సైనికుల ఉపసంహరణ

ఫ్రాన్సు సైనికులలో మొదటి బ్యాచ్ ఆఫ్ఘనిస్ధాన్ నుండి స్వదేశం చేరుకోవడానికి సిద్ధమయ్యారు. బుధవారం ఈ సైనికుల విరమణ జరుగుతుంది. మొదటి విడతగా 200 మంది సైనికుల్ని వెనక్కి పిలిపిస్తున్నట్లుగా ఫ్రాన్సు ప్రకటించింది. గత జులైలో ఆఫ్గనిస్ధాన్ సందర్శించిన సందర్భంగా తమ సైనికులను ఉపసంహరించుకుంటామని ఫ్రాన్సు అధ్యక్షుడు నికోలస్ సర్కోజి ప్రకటించాడు. అది ఇప్పుడు ప్రారంభమయ్యింది. రెండవ విడతలో మరో 200 మంది సైనికులను విరమిస్తామని ఫ్రాన్సు తెలిపింది. రాబోయే క్రిస్టమస్ పండగలోపు రెండవ విడత సైనికులు ఫ్రాన్సు…

ఆఫ్ఘనిస్ధాన్ నుండి అమెరికా సైనికుల ఉపసంహరణ ప్రారంభం -కార్టూన్

వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో బారక్ ఒబామా పోటీ చేయనుండడం, ఆఫ్ఘన్ యుద్ధం పట్ల అమెరికన్లలో నానాటికీ వ్యతిరేకత పెరుగుతుండడంతో పాటు ఒసామా బిన్ లాడెన్ హత్య (?) కూడా కలిసి రావడంతో ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణ నుండి ఈ సంవత్సరం 10,000 మంది అమెరికా సైనికుల్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఒబామా ప్రకటించాడు. మొదటి విడత ఉపసంహరణ ప్రారంభం అయ్యిందని కూడా పత్రికలు రాస్తున్నాయి. ఆర్ధిక బలహీనత నేపధ్యంలో ఆఫ్ఘన్ యుద్ధం అమెరికాకి నానాటికీ భారంగా మారింది. వ్రతం చెడ్డా…