ఐ.ఎస్.ఐ అధిపతి అమెరికా పర్యటన విజయవంతం, బాగుపడిన ఐ.ఎస్.ఐ, సి.ఐ.ఎ ల సంబంధాలు

90 మందికి పైగా సి.ఐ.ఎ గూఢచారులను పాకిస్ధాన్ ప్రభుత్వం దేశం నుండి వెళ్ళగొట్టడంతో పాక్, అమెరికాల మధ్య సంబంధాలు బెడిసి కొట్టిన సంగతి విదితమే. సి.ఐ.ఎ గూఢచారులను వెనక్కి పంపడంతో అమెరికా కూడా పాకిస్ధాన్ కి ఇవ్వవలసిన 800 మిలియన్ డాలర్ల సహయాన్ని నిలిపివేసింది. తమ గూఢచారులు పాకిస్ధాన్ సైన్యానికి శిక్షణ ఇవ్వడానికే అక్కడ ఉన్నారనీ, వారే లేకపోతే ఇక శిక్షణకి ఇచ్చే సొమ్ము ఇవ్వవలసిన అవసరం లేదనీ సి.ఐ.ఏ అధికారులు, సహాయం నిలిపివేస్తున్నట్లు చేసిన ప్రకటన…