ఇండియా మాకు మిలట్రీ సాయం చెయ్యాలి -ఆఫ్ఘన్
భారత దేశం తమకు మిలట్రీ సహాయం చేయాలని ఆఫ్ఘనిస్తాన్ మరోసారి గట్టిగా కోరింది. పాకిస్ధాన్ ఏమన్నా అనుకుంటుందేమో అన్న శంకతో తమకు సాయం చేయకుండా వెనక్కి తగ్గడం భావ్యం కాదని, ఆఫ్ఘనిస్ధాన్ భద్రత సక్రమంగా ఉంటే అది భారత దేశానికి కూడా భద్రత అవుతుందని గుర్తించాలని ఇండియాలో ఆఫ్ఘన్ రాయబారి షాయిదా అబ్దాలి స్పష్టం చేశారు. ది హిందూ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అబ్దాలి ఈ మేరకు ఆఫ్ఘన్ కోరికను పునరుద్ధరించారు. గత సంవత్సరం డిసెంబర్ నెలలో…