అమెరికా విమాన దాడుల్లో 11 మంది ఆఫ్ఘన్ పిల్లల దుర్మరణం

అమెరికా నేతృత్వంలోని నాటో బలగాలు ఆఫ్ఘనిస్ధాన్ లో మరో మారణకాండను సృష్టించాయి. మిలిటెంట్లను చంపే పేరుతో పదకొండు మంది పసి పిల్లలను, ఒక మహిళను విమాన దాడుల్లో చంపేసింది. జరిగిన ఘోరానికి విచారం వ్యక్తం చేయకపోగా ‘పౌరులు చనిపోయిన వార్తలు విన్నాం. కానీ ధృవపరచలేం’ అని నాటో ప్రతినిధి డాన్ ఈనెర్క్ వ్యాఖ్యానించినట్లు రష్యా టుడే, ది హిందు పత్రికలు తెలిపాయి. అమెరికా దళాలు అమాయక ఆఫ్ఘన్ పౌరులను “ఇబ్బంధుల పాలు చేస్తున్నాయి, హింసిస్తున్నాయి, చంపేస్తున్నాయి” అని…

బ్రిటన్ కూడా ఆఫ్ఘనిస్ధాన్‌నుండి సైన్యాన్ని ఉపసంహరిస్తుందట!

అమెరికా సైనికులను 33,000 మందిని వచ్చే సంవత్సరం సెప్టెంబరు లోపల ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణ నుండి ఉపసంహరిస్తానని ప్రకటించాక ఫ్రాన్సు, తాను కూడా తన సైనికులు కొద్దిమందిని ఉపసంహరిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బ్రిటన్ కూడా అమెరికాను అనుసరిస్తానని ప్రకటిస్తోంది. కనీసం 500 మంది బ్రిటిష్ సైనికుల్ని వెనక్కి రప్పించే అంశాన్ని బ్రిటన్ ప్రధాని కామెరూన్ పరిగణిస్తున్నట్లుగా వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక తెలిపింది. ఈ మేటర్‌తో సంబంధం ఉన్న విశ్వసనీయమైన వ్యక్తి తెలిపిన సమాచారంగా ఆ పత్రిక…

మిలట్రీకి ఎక్కువ, కాంగ్రెస్‌కి తక్కువ; సేనల ఉపసంహరణతో ఒబామా రాజకీయ క్రీడ

ఆఫ్ఘనిస్ధాన్‌లో దురాక్రమణ యుద్ధం కొనసాగిస్తున్న ఒక లక్షా ఒక వెయ్యి మంది అమెరికా సైనికుల్లో 33,000 మందిని 2012 సెప్టెంబరు మాసాంతంలోపు వెనక్కి రప్పిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు, అమెరికా త్రివిధ దళాల సర్వ సైన్యాధ్యక్ధుడు అయిన బారక్ ఒబామా బుధవారం ప్రకటించాడు. ఒబామా ప్రకటించిన ఉపసంహరణ సంఖ్య అమెరికాలోని వివిధ అధికార కేంద్రాలు ఒకే దృష్టితో చూడలేకపోవడం, భిన్న ధృవాలుగా చీలి ఉండడం గమనార్హమైన విషయం. 2012 చివర్లో మరోమారు అధ్యక్షుడిగా పోటీ చేయాలని భావిస్తున్న ఒబామా…