మహిళలు ఒకరి సొంత ఆస్తి కాదు! -తాలిబాన్ డిక్రీ

ఆఫ్ఘనిస్తాన్ నేల నుండి ఒక శుభ వార్త! మహిళల హక్కులను, ఆకాంక్షలను అణచివేయడంలో పేరు పొందిన తాలిబాన్ ఆఫ్ఘన్ ఆడ పిల్లలకు అనుకూలంగా ఒక ముఖ్యమైన డిక్రీ జారీ చేయడం ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. “స్త్రీ ఏ ఒక్కరి ఆస్తీ కాదు. ఆమెను ఒక గౌరవప్రదమైన మరియు స్వేచ్ఛాయుత మానవునిగా పరిగణించాలి. శాంతికి బదులుగానో లేక శతృత్వానికి ముగింపు పలికే లక్ష్యంతోనో ఏ స్త్రీనీ మారకానికి ఇవ్వడం జరగరాదు” అని తాలిబాన్ ప్రభుత్వం డిక్రీ జారీ…

అమెరికా ప్రతీకారం: కరెన్సీ సమస్యతో అల్లాడుతున్న ఆఫ్ఘన్ ప్రజలు

తాలిబాన్ పాలనపై అమెరికా పాల్పడుతున్న ప్రతీకార చర్యలు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలను తీవ్ర సంక్షోభం లోకి నెట్టివేస్తున్నాయి. పశ్చిమ దేశాల నుండి ఇప్పటిదాకా అందుతూ వచ్చిన సహాయాన్ని నిలిపివేయడంతో పాటు ఆఫ్ఘన్ దేశానికి చెందిన సెంట్రల్ రిజర్వ్ బ్యాంకు రిజర్వు నిధులను కూడా అందకుండా నిషేధం విధించడంతో ఉన్నత స్ధాయీ ప్రభుత్వాధికారుల నుండి అత్యంత కడపటి పౌరుడు సైతం తిండికి, ఇతర కనీస సౌకర్యాలకు కటకటలాడుతున్నారు. తాలిబాన్ డబ్బు సమస్య ప్రధానంగా అమెరికా ట్రెజరీ విభాగం స్తంభింపజేసిన ఆఫ్ఘన్…

ప్రమాణానికి ముందే ఆఫ్ఘన్ తో చర్చలు చేసిన మోడి

మాట్లాడితే ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ లపై విద్వేషం వెళ్లగక్కే మోడి అభిమానులు, ప్రధానిగా మోడి తీసుకుంటున్న చర్యలను ఏ విధంగా అర్ధం చేసుకుంటారన్నదీ పరిశీలించాల్సిన విషయం. భారత దేశానికి శత్రు దేశాలయిన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లతో సత్సంబంధాలను మీరు ఎలా కోరుకుంటారో అర్ధం కావట్లేదు అని ఒక హిందూత్వ అభిమాని ఈ బ్లాగ్ రచయితను ప్రశ్నించిన సంగతి ఇటీవలి విషయమే. అయితే మోడి ప్రధాన మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేయకమునుపే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్ధాన్ రెండు దేశాలతోనూ చర్చలు…