ఖురాన్ దహనంపై ఆఫ్ఘన్ల నిరసనలు -ఫొటోలు
ఆఫ్ఘనిస్ధాన్ లోని అమెరికా సైనిక స్ధావరంలో సైనికులు ఖురాన్ ప్రతులను దగ్ధం చేయడంతో వారం రోజుల నుండి అక్కడ ప్రజల నిరసనలు వెల్లువెత్తాయి. ఆదివారం ఇద్దరు సీనియర్ అమెరికా సైనికాధికారులను ఆఫ్ఘన్ పోలీసు కాల్చి చంపాడు. శనివారం నిరసనకారులు విసిరిన గ్రేనేడ్ పేలి పది మందికి పైగా అమెరికా సైనికులు, అధికారులు గాయపడ్డారు. నిరసన ప్రదర్శనలపై ఆఫ్ఘన్ పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇప్పటికి పాతిక మందికి పైగా నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా అధ్యక్షుడు ఒబాబా తో…