డీమానిటైజేషన్ గాలిలో కొట్టుకుపోయిన మోడీ అవినీతి?!

గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా నరేంద్ర మోడీ అవినీతికి పాల్పడిన అంశంపై దర్యాప్తు జరపాలని సుప్రీం కోర్టు అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ ఆదాయ పన్ను శాఖకు ఫిర్యాదు లేఖ రాసిన రోజే ప్రధాని నరేంద్ర మోడీ ‘డీమానిటైజేషన్’ ప్రకటించిన సంగతి ఎంతమందికి తెలుసు? ప్రశాంత్ భూషణ్ ఎవరో తెలియనివారు / గుర్తులేనివారు ఓసారి 2జి కుంభకోణం, బొగ్గు కుంభకోణం లను గుర్తు చేసుకుంటే సరిపోతుంది. ఈ రెండు కుంభకోణాలు సుప్రీం కోర్టు మెట్లు ఎక్కడానికి ప్రధాన కారకుడే ప్రశాంత…