ఆదర్శ అవినీతి వటవృక్షం వేళ్ళు పెగిలేనా? -కార్టూన్
“భారత రాజకీయ నాయకులు, మంత్రులు, బ్యూరోక్రాట్ అధికారుల అవినీతికీ, అత్యాశకూ నిలువెత్తు గుర్తుగా నిలిచిన ఆదర్శ హౌసింగ్ సొసైటీ టవర్ ని కూల దోయండి” అని ముంబై హై కోర్టు శుక్రవారం (ఏప్రిల్ 29) తీర్పు ప్రకటించింది. “ఈ అవినీతిలో భాగం పంచుకున్న నేతలు, అధికారులు అందరి పైనా, అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు క్రిమినల్ కేసులు నమోదు చేయాలి” అని హై కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆదర్శ హౌసింగ్ సొసైటీ భవన నిర్మాణం ‘అనాధికారికం, చట్ట…