అరుణాచల్: మాజీ ముఖ్యమంత్రి ఆత్మహత్య
గత ఏడెనిమిది నెలలుగా కాంగ్రెస్, బిజెపిల పదవీ రాజకీయాలకు కేంద్రంగా వార్తల్లో నిలిచిన అరుణాచల్ ప్రదేశ్, అనూహ్య సంఘటనను చవి చూసింది. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీలో తిరుగుబాటుకు నేతృత్వం వహించి, అనంతరం బిజెపి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి కలిఖో పల్, ముఖ్యమంత్రి నివాసంలో శవమై కనిపించాడు. ఆయన ఆత్మహత్య చేసుకున్నారని వార్తలు తెలియజేస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కలిఖో పల్ ఆత్మహత్య చేసుకున్నారని రాష్ట్ర పోలీసులు ప్రకటించారు. ఆయన తాడుతో మెడకు ఉరి వేసుకుని…