ముస్లిం హిందువులు మళ్ళీ ముస్లిం మతం లోకి…

సంఘ పరివార్ గణాలు ఆగ్రాలో అట్టహాసంగా నిర్వహించిన ముస్లిం మత మార్పిడి మూన్నాళ్ల ముచ్చటగా ముగిసింది. భూములు ఇస్తామని మాయ మాటలు చెప్పి ముస్లిం మతం నుండి కొందరిని హిందు మతంలోకి మార్చినట్లు తతంగం నడిపారని మోసం గ్రహించి తిరిగి ముస్లిం మతంలోకి వచ్చామని సదరు ముస్లింలు చెప్పడం విశేషం. ఆగ్రాలోని నాట్ కమ్యూనిటీకి చెందిన ముస్లింలు అత్యంత పేదవారు. వారికి తమది అని చెప్పుకునే ఆస్తులు దాదాపు లేవు. ప్రభుత్వానికి చెందిన వృధా భూముల్లోనే తాత్కాలిక…