కార్మిక వర్గ పోరాటాలను హైజాక్ చేసిన “వాల్ స్ట్రీట్ ఆక్రమిద్దాం” ఉద్యమం -4

OTPOR మరియు CANVAS (కేన్వాస్) OTPOR అన్నది సెర్బియా భాషా పదం. ‘ప్రతిఘటన’ అని దాని అర్ధం. సెర్బియాలో 1998లో తలెత్తి 2003వరకూ కొనసాగిన ఉద్యమంగా ఇది చరిత్రలో రికార్డయి ఉంది. అహింసా పద్ధతుల్లో ఉద్యమించి నాటో దాడులకు, సామ్రాజ్యవాద ఆక్రమణలకు ఎదురొడ్డి నిలిచిన అప్పటి సెర్బియా నాయకుడు స్లోబోడాన్ మైలోసెవిక్ ను అక్టోబరు 5, 2000 న కూలదోయగలిగిందని ఈ సంస్ధకు పేరు ఉంది. మైలోసెవిక్ ప్రభుత్వం కూలిపోయాక కూడా ఈ సంస్ధ కొనసాగి కొత్త…

కార్మిక వర్గ పోరాటాలను హైజాక్ చేసిన “వాల్ స్ట్రీట్ ఆక్రమిద్దాం” ఉద్యమం -3

అక్టోబరు 15 తేదీనజరిగిన “ఆకుపై యూజీన్” ప్రదర్శనలో ‘మంత్లీ రివ్యూ‘ పత్రిక ఎడిటర్ ‘జాన్బెల్లమీ ఫాస్టర్‘ పాల్గొని ప్రసంగించాడు. తన ప్రసంగంలో ఆమెరికాలో ఆదాయఅంతరాలపై ఆయన చెప్పిన కొన్నివివరాలు ఇలా ఉన్నాయి. పైన ఉన్న ఒక శాతం మంది, అమెరికా మొత్తం ఆదాయంలో 25 శాతానికి సొంతదారులు. పైన ఉన్న పది శాతం మంది, మొత్తం ఆదాయంలో దాదాపు 50 శాతానికి సొంతదారులు. 1950, 1970 సం.ల మధ్య కాలంలో కింది 90 శాతం మంది సంపాదించిన…

కార్మిక వర్గ పోరాటాలను హైజాక్ చేసిన “వాల్ స్ట్రీట్ ఆక్రమిద్దాం” ఉద్యమం -2

అమెరికా అసమానతలు అక్టోబరు 26 తేదీన కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీసు (సి.బి.ఒ) అమెరికాలో ఆర్ధిక అంతరాయాలపైన ఒక నివేదికను వెలువరించింది. దాని ప్రకారం అమెరికాలో అత్యంత ధనికులైన ఒక శాతం మంది ఆదాయాలు 1979, 2007 మధ్య మూడు రెట్లు (275 శాతం) పెరగ్గా, జాతీయ సంపదలో వారి వాటా రెట్టింపు (8 శాతం నుండి 17 శాతానికి) పెరిగింది. ఇదే కాలంలో ఆందరికంటె పైన ఉన్న 20 శాతం మంది జాతీయాదాయంలో తమ వాటా పెంచుకోగా,…

కార్మిక వర్గ పోరాటాలను హైజాక్ చేసిన “వాల్ స్ట్రీట్ ఆక్రమిద్దాం” ఉద్యమం -1

“వాల్ స్ట్రీట్ ఆక్రమిద్దాం (ఆకుపై వాల్‌స్ట్రీట్).” ఇప్పుడు అమెరికాలో ప్రజలను, పాలకులను ఆకర్షిస్తున్న ఉద్యమం ఇది. సమస్యలపై అందరి దృష్టినీ ఆకర్షించినందుకు ప్రశంశలనూ, ఒక నాయకుడు గానీ, నిర్ధిష్ట డిమాండ్లు గానీ లేనందుకు విమర్శలను ఈ ఉద్యమం ఎదుర్కొంటోంది. ప్రజలు ఆ ఉద్యమానికి తమ మద్దతు తెలుపుతుండగా, కొందరు పాలకులు సంపన్నులు కూడా ప్రత్యక్ష, పరోక్ మద్దతును ప్రకటిస్తున్నారు. మరికొందరు తమ మౌనంతో ఉద్యమానికి ప్రచారం రాకుండా ప్రయత్నిస్తున్నారు. అక్కడక్కడా సంపన్నులు నోరు తెరిచి ఉద్యమం, అసంతృప్తుల…

‘ఆకుపై వాల్ స్ట్రీట్’ ఆందోళనా శిబిరాల్లో హత్యలు, ఆత్మహత్యలు

‘ఆకుపై వాల్‌స్ట్రీట్’ ఉద్యమాల నిమిత్తం వివిధ నగరాల కూడళ్ళలో ఆందోళనకారులు గుడారాలు వేసుకుని రాత్రింబవళ్ళూ అక్కడే గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ శిబిరాల్లో జరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు ఇపుడు సమస్యగా మారాయి. ఈ చావులు అటు నిరసనకారులకూ, ఇటు పోలీసులకు కూడా సమస్యలుగా మారాయి. ఆకుపై వాల్ స్ట్రీట్, ఆకుపై ఓక్లాండ్ లాంటి నగరాల్లో నిరసన కారులు వేసుకున్న శిబిరాల్లో ఒకరు తెలియని కారణాల వల్ల చనిపోగా, మరొకరు తనను తాను కాల్చుకుని చనిపోయారు. మరో ఇద్దరు…