క్లుప్తంగా… 14.05.2012

జాతీయం పార్లమెంటుకి 60 సంవత్సరాలు భారత పార్లమెంటు సమావేశమై ఆదివారం (మే 13) తో 60 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పార్లమెంటు ఆదివారం ప్రత్యేకంగా సమావేశం జరిపింది. రాజ్య సభ లో ప్రధాని మన్మోహన్, లోక్ సభలో ఆర్ధిక మంత్రి ప్రణబ్ చర్చ ప్రారభించారు. పార్లమెంటులో పదే పదే అవాంఛనీయ సంఘటనలు జరగడం పట్ల ప్రధాని ఆందోళన వెలిబుచ్చాడు. “సమావేశాలకు ప్రతిరోజూ ఆటంకాలు ఎదురు కోవడం, వాయిదాలు పడడం, కేకలు వేయడం వల్ల బైటి వారికి…

‘ఆకుపై వాల్‌స్ట్రీట్’ సైగల భాష -బొమ్మలు

ఉద్యమాలు సృజనాత్మకతకు కేంద్రాలుగా భాసిల్లడం అనాదిగా వస్తున్న చరిత్ర. ఉద్యమాలకు ఉండే వివిధ అవసరాలు సృజనాత్మకతకు పదును పెడుతుంటాయి. వందలు, వేల మందిని ఆర్గనైజ్ చెయ్యవలసిన పరిస్ధితుల్లో ఒకరు వందల మందితో, తిరిగి వందలమంది ఒకరితో సంభాషించవలసిన పరిస్ధితుల్లో, దూరంగా ఉంటూ పరస్పరం సంభాషించుకోవలసిన పరిస్ధితుల్లో సైగల భాషకు ‘ఆకుపై వాల్ స్ట్రీట్’ ఉద్యమం జన్మనిచ్చింది. జన్మనిచ్చింది అనడం కంటే పదును పెట్టింది అనడం సరిగా ఉంటుంది. ‘ఆకుపై’ ఉద్యమాలకు మైక్ పర్మిషన్ ఇవ్వని పరిస్ధుతులనుండి ‘హ్యూమన్…

‘ఆకుపై వాల్‌స్ట్రీట్’ ఉద్యమంతో పెరిగిన పోలీసు ఉద్యోగాలు! -కార్టూన్

“వాల్ స్ట్రీట్ ఆక్రమిద్దాం” ఉద్యమం ప్రపంచవ్యాపితంగా 85 దేశాలలోని 2,500 నగరాలకు వ్యాపించినట్లుగా ఉద్యమ సంస్ధల వెబ్ సైట్లు చెబుతున్నాయి. ఈ ఉద్యమం ఇతర ప్రాంతాల్లో కంటె అమెరికా, యూరప్ లలోనే ఎక్కువగా కనిపిస్తోంది. లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియాలలో కొన్ని ప్రధాన పట్టణాలలో పదుల సంఖ్యలో మాత్రమే నిరసనకారులను ఆకర్షిస్తున్న ఈ ఉద్యమం ఉత్తర అమెరికా, యూరప్ దేశాలలో మాత్రం వేల సంఖ్యలో ప్రజలను ఆకర్షిస్తోంది. ప్రపంచ ఆర్ధిక సంక్షోభానికి ఎక్కువగా దెబ్బ తిన్నది అమెరికా,…

ఇంతకీ ‘ఆకుపై వాల్‌స్ట్రీట్’ ఉద్యమం ఎందుకోసం? -కార్టూన్

— పెట్టుబడిదారుడు: అయితే, మీ నిరసనలు దేనికోయ్? నిరసనకారుడు 1: ఉద్యోగాలు, ఇళ్ళు, ఆరోగ్య సంరక్షణ, విద్య… నిరసనకారుడు 2: న్యాయం, నిజాయితీ, నమ్మకం, మార్పు, హేతుబద్ధత… నిరసనకారుడు 3: శాంతి, శుభ్రమైన గాలి, నీరు, భూమి, భవిష్యత్తు… నిరసనకారుడు 4: ?! పెట్టుబడిదారుడు: అంతేనా? —

అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో ‘ఆకుపై వాల్‌స్ట్రీట్’ తరహా ఆందోళనలు

“ఆకుపై వాల్‌స్ట్రిట్!” నెల రోజుల క్రితం కేవలం కొద్ది డజన్ల మందితో ప్రారంభమైన ఈ అందోళన ఇపుడు ప్రపంచ స్ధాయి ఆందోళనగా మారింది. రెండు వారాలకే అమెరికా అంతటా పాకిన అమెరికన్ల ఆందోళనలు ఆ తర్వాత యూరప్ దేశాలకు కూడా పాకాయి. ఇపుడు జపాన్ నగరం టోక్యోకు పాకి “టోక్యో ఆక్రమిద్దాం” అంటూ జపనీయులు నినదిస్తున్నారు. ప్రపంచ ఆర్ధిక సంక్షోభం పేరు చెప్పి ట్రిలియన్ల కొద్దీ ప్రజా ధనాన్ని ‘బెయిలౌట్’లుగా వాల్‌స్ట్రీట్ కంపెనీలకు పందేరం పెట్టిన సంగతి…

అమెరికా దరిద్రం అమెరికన్ల రాతల్లోనే చూద్దాం

ప్రపంచ ఆర్ధిక సంక్షోభం దెబ్బకు అమెరికా ఆర్ధికంగా కునారిల్లుతోంది. అమెరికా దరిద్రం ఒడిలో కునుకు తీస్తోందని అమెరికా ప్రభుత్వ సర్వే తెలుపుతున్నా అమెరికాను ఆరాధించే మూఢ భక్తులకు కళ్ళు తెరుచుకోవడం లేదు. అమెరికా గడ్డపై పుట్టి పెరిగిన తెల్ల, నల్ల, రంగు అమెరికన్లు అంతా ఇపుడు తమ భవిష్యత్తును తామే రూపొందించుకోవాల్సిన అవసరాన్ని గుర్తిస్తున్నారు. వాల్‌స్ట్రీట్ కంపెనీలు తమ జీవితాల్ని ఎలా బలితీసుకుంటున్నదీ తెలుసుకుని వీధుల్లోకి వస్తున్నారు. సెప్టెంబరు 17న ప్రారంభమైన “ఆకుపై వాల్‌స్ట్రీట్” ఉద్యమంలో ఇప్పుదు…