అమెరికా దరిద్రం అమెరికన్ల రాతల్లోనే చూద్దాం

ప్రపంచ ఆర్ధిక సంక్షోభం దెబ్బకు అమెరికా ఆర్ధికంగా కునారిల్లుతోంది. అమెరికా దరిద్రం ఒడిలో కునుకు తీస్తోందని అమెరికా ప్రభుత్వ సర్వే తెలుపుతున్నా అమెరికాను ఆరాధించే మూఢ భక్తులకు కళ్ళు తెరుచుకోవడం లేదు. అమెరికా గడ్డపై పుట్టి పెరిగిన తెల్ల, నల్ల, రంగు అమెరికన్లు అంతా ఇపుడు తమ భవిష్యత్తును తామే రూపొందించుకోవాల్సిన అవసరాన్ని గుర్తిస్తున్నారు. వాల్‌స్ట్రీట్ కంపెనీలు తమ జీవితాల్ని ఎలా బలితీసుకుంటున్నదీ తెలుసుకుని వీధుల్లోకి వస్తున్నారు. సెప్టెంబరు 17న ప్రారంభమైన “ఆకుపై వాల్‌స్ట్రీట్” ఉద్యమంలో ఇప్పుదు…

అమెరికా అంతటా విస్తరిస్తున్న వాల్‌స్ట్రీట్ వ్యతిరేక ఆందోళనలు

అమెరికాలొ వాల్‌స్ట్రీట్ కంపెనీల దోపిడికి, వాల్‌స్ట్రీట్ కంపెనీలకు సహకరిస్తున్న పాలకుల విధానాలకూ వ్యతిరేకంగా అమెరికన్లు సాగిస్తున్న ఆందోళనలు అక్టోబరు 4 తేదీతో 19 వ రోజుకి చేరుకున్నాయి. సెప్టెంబరు 17 తేదీన న్యూయార్క్ లో కొద్దిమందితో మొదలైన “వాల్‌స్ట్రీట్ ను ఆక్రమించండి” ఉద్యమం, క్రమంగా ఇంతింతై, వటుడింతై అన్నట్లుగా అమెరికాలోని అన్ని రాష్ట్రాలకూ పాకింది. అస్ధిర ఆర్ధిక వ్యవస్ధపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, కార్పొరేట్ కంపెనీల అత్యాశను నిరసిస్తూ ఫెడరల్ రిజర్వ్ బ్యాంకుల శాఖలను ప్రదర్శనలు, ఆందోళనలతో…