ఏది చీకటి, ఏది వెలుతురు? పాట ఒకటే చిత్రీకరణలేన్నో!

ఈ పాట రాసింది శ్రీ శ్రీ అని తెలియనివారు ఉంటారనుకోను. రాసినప్పుడు ఆయన పాటగా రాశారో, కవిత్వంగా రాశారో నాకు ఖచ్చితంగా తెలియదు. కవిత్వంగానే రాశారని నేనిన్నాళ్లూ అనుకున్నాను. ఆఫ్ కోర్స్, ఇప్పుడూ అదే అనుకుంటున్నాననుకోండి! ఈ పాటను ఒక సినిమాలోనే వాడుకున్నారని అనుకున్నా ఇన్నాళ్ళు. కానీ ఇంకా ఇతర సినిమాల్లో కూడా వాడుకున్నారని ఈ రోజు తెలిసింది. ‘ఆకలి రాజ్యం’ సినిమాలో ఈ పాటను మొదటిసారి విన్నాను, చూశాను. చాలా చిన్నప్పుడు (ఎనిమిదో తరగతిలో) ఆ…