బ్రెగ్జిట్ వ్యతిరేకి చేతుల్లో బ్రెగ్జిట్!

యూకె లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈయూ నుంచి విడాకులు తీసుకునే కార్యక్రమం బ్రెగ్జిట్ అనుకూల రాజకీయ నాయకుల చేతుల మీదుగా జరగవలసి ఉండగా అది కాస్తా ఇప్పుడు బ్రెగ్జిట్ వ్యతిరేకుల చేతుల మీదుగా జరిగిపోయే పరిస్థితి ఏర్పడింది. నిజానికి పరిస్ధితి ఏర్పడటం కాదు, అదే జరగబోతోంది కూడా. బ్రెగ్జిట్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసిన బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ తన ప్రచారానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ…