గత ప్రభుత్వాలూ కృషి చేశాయి -దారి తప్పిన మోడి

అస్సాంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. సర్బానంద సోనోవాల్ నేతృత్వంలో బి‌జే‌పి మొదటి సారిగా అస్సాంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అనేకమంది కేబినెట్ మంత్రులతో సహా ప్రధాన మంత్రి నరేంద్ర మోడి కూడా కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంతవరకు ఈ వార్తలో విశేషం ఏమీ లేదు. ప్రధాన మంత్రి ప్రసంగంలో దొర్లిన కొన్ని మాటలే అసలు విశేషం. “స్వతంత్రం అనంతరం గతంలో ఏ ప్రభుత్వం అధికారం లోకి వచ్చినా కూడా, ప్రతి…

అస్సాం మారణకాండ -ది హిందు ఎడిటోరియల్

(ది హిందు, 25.12.2014 నాటి Carnage in Assam ఎడిటోరియల్ కు ఇది యధాతధ అనువాదం.) జాతుల హింసాకాండ దిగ్భ్రాంతికర రీతిలో తిరిగి జడలు విప్పడంతో నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ (ఎన్.డి.ఎఫ్.బి) – సాంగ్ బిజిత్ ముఠా కు చెందిన సాయుధ మిలిటెంట్లు సోనిట్ పూర్, కొక్రాఝర్ మరియు ఇతర జిల్లాల్లో సాగించిన వరుస దాడుల్లో 67 మంది ఆదివాసీలు ప్రాణాలు కోల్పోయారు. (ఈ ఆదివాసీలు ఇప్పటికీ గిరిజన హోదా కోసం పోరాడుతున్నారు.) మూడు…