రష్యా హ్యాకింగ్: పొరపాటు చేశాం -అమెరికా మీడియా

నిజం క్రమంగా బైటికి వస్తోంది. రష్యా హ్యాకింగ్ విషయమై తాము చెప్పినదానికి ఆధారాలు లేవని ఒక్కో అమెరికా మీడియా కంపెనీ లెంపలు వెసుకుంటూ ముందుకు వస్తున్నాయి. అమెరికా ఎన్నికలను రష్యా హ్యాక్ చేసిందనీ, హిల్లరీ క్లింటన్ కు వ్యతిరేకంగా అమెరికా ఎన్నికలను హ్యాక్ చేయడం ద్వారా డొనాల్డ్ ట్రంప్ గెలుపొందేందుకు రష్యా హ్యాకింగ్ తోడ్పడిందనీ ఇన్నాళ్లూ తాము చేసిన ప్రచారం అంతా ఒట్టిదేనని అమెరికా మీడియా సంస్ధలు ఒప్పేసుకుంటున్నాయి. “రష్యా హ్యాకింగా? అబ్బే అదంతా ఒట్టి చెత్త,…