‘పాకిస్ధాన్ నరకం కాదు’ అన్నా దేశద్రోహమేనా?

  “అసహనం ఎక్కడుంది?” అని ప్రశ్నిస్తూ  ఢిల్లీలో ఊరేగింపు నిర్వహించిన హాలీ వుడ్ నటుడు ‘అనుపమ్ ఖేర్’ ఓ సారి కర్ణాటక వఛ్చి చూడాలి. హిందుత్వ మూకలు ఏమి చేసినా అది దేశ భక్తే అనో లేదా సహన సహితమే అనో ఆయన తేల్చిపారేస్తే తప్ప, ‘అసహనం’ రుచి ఏమిటో ఆయనకు తెలుస్తుంది.  “పాకిస్తాన్ నరకం ఏమి కాదు. అది ప్రజలు నివసించే దేశం” అని రాజకీయవేత్తగా మారిన ఒక సినిమా నటి ప్రకటించారు. “పాకిస్ధాన్ అంటే…

కాస్త అసహనం ఉన్నది నిజమే -వెంకయ్య

‘ఎక్కడ అసహనం, ఆయ్?’ అని దబాయించిన వారికి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం వెంకయ్య నాయుడు సమాధానం ఇచ్చారు. అసహనంపై రాజ్య సభలో జరిగిన చర్చలో పాల్గొంటూ ఆయన “మన సమాజంలో ‘కొంత మొత్తంలో’ అసహనం ఉన్నమాట నిజమే. దానిని గుర్తించి దానితో కఠినంగా వ్యవహరించవలసిన అవసరం ఉన్నది” అని వెంకయ్య అంగీకరించారు. తన ఒప్పుకోలు -పాక్షికంగానే అయినా- ద్వారా  ఆయన దేశంలో అసహనమే లేదు పొమ్మని నిరాకరించిన హిందూత్వ నేతలకు గట్టి షాక్ ఇచ్చారు.…

అమీర్ ఖాన్ మాట్లాడే హక్కు -ది హిందు ఎడిటోరియల్

[“Aamir Khan’s right to speak” శీర్షికన ఈ రోజు (నవంబర్ 26) ది హిందు ప్రచురించిన సంపాదకీయానికి ఇది యధాతధ అనువాదం. -విశేఖర్] **************** భారతీయ జనతా పార్టీ పరివారం సవరించుకున్న లెక్కలో ఇప్పుడు అమీర్ ఖాన్ ఇండియాకు చెడ్డపేరు తెస్తున్న విలన్. రచయితలు, నటులు, శాస్త్రవేత్తలకు మద్దతుగా వస్తూ, తన సొంత ఆందోళనకు, బహుశా మాటల ఒరవడిలో, మరోచోటికి వెళ్లవలసి వస్తుందా అంటూ తన భార్య వ్యక్తపరిచిన ఆతృత మరియు ఆలోచనలకు గొంతుక ఇవ్వడం…