తాడేపల్లి బృందం అరెస్టుపై ‘ది హిందూ’ వార్త -కత్తిరింపు

తాడేపల్లి బృందం అరెస్టు విషయాన్ని బుధవారం ‘ది హిందూ’ పత్రిక వార్తగా ప్రచురించింది. హైద్రాబాద్ ఎడిషన్ లో మొదటి పేజిలో ఈ వార్తను ప్రచురించడం విశేషం. వార్త స్క్రీన్ షాట్ ను కింద చూడవచ్చు. (బొమ్మపై క్లిక్ చేసి పెద్ద సైజులో చూడగలరు.) –    

వారి భావజాలంపై పోరాటం కోసమే పోలీసు కేసు –మహిళా నేత సంధ్య

తాడేపల్లి, కృష్ణ మోహన్ తదితరులు వ్యక్తం చేసిన మహిళా వ్యతిరేక భావజాలంపై తాము పోరాటం ఎక్కుపెట్టామని అందుకే పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించడానికే తాము నిర్ణయం తీసుకున్నామని ప్రగతిశీల మహిళా సంఘం (POW) రాష్ట్ర అధ్యక్షురాలు వి. సంధ్య తెలిపారు. క్షమాపణలతో వదిలెయ్యడమా లేక కేసు పెట్టాలా అన్న విషయాన్ని తాము చర్చించామని, అంతిమంగా కేసు పెట్టడానికే తాము నిర్ణయించుకున్నామని సంధ్య తెలిపారు. కొద్దిసేపటి క్రితం సంధ్య గారిని ఈ బ్లాగర్ సంప్రదించగా ఆమె…