బలి పశువులు కావలెను -కార్టూన్

ఎట్టకేలకు కళంకిత మంత్రులుగా పేరుబడిన ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా చేశారు. అనవసర వివాదంతో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకనే రాజీనామా చేశానని అశ్వనీ కుమార్ అంటే, పవన్ కుమార్ బన్సాల్ ఆ మాట కూడా చెప్పలేదు. సి.బి.ఐ నివేదికను మంత్రి అశ్వనీ కుమార్, ఇతర బ్యూరోక్రాట్ అధికారులు మార్చడం వల్ల నివేదిక ఆత్మ మారిపోయిందని, వారి జోక్యం వలన విచారణ పక్కదారి పట్టే అవకాశం ఏర్పడిందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించినప్పటికీ తనను కోర్టు తప్పు…

బొగ్గు: రాజకీయుల ఆదేశాలు తీసుకోవద్దు, సి.బి.ఐతో సుప్రీం

బొగ్గు కుంభకోణం విచారణకు సంబంధించి ఇక నుండి రాజకీయ కార్యనిర్వాహకుల (political executive) నుండి ఆదేశాలు తీసుకోవద్దని సుప్రీం కోర్టు సి.బి.ఐ ని ఆదేశించింది. ఏప్రిల్ 26 తేదీన సి.బి.ఐ సమర్పించిన అఫిడవిట్ లో అత్యంత కలతపరిచే అంశాలు ఉన్నాయని సుప్రీం వ్యాఖ్యానించింది. బొగ్గు కుంభకోణం విచారణలో సుప్రీం కోర్టుకు సి.బి.ఐ సమర్పిస్తున్న (దర్యాప్తు) పురోగతి నివేదికలను కోర్టుకు సమర్పించే ముందు ప్రభుత్వ మంత్రులకు బ్యూరోక్రాట్ అధికారులకు చూపిస్తున్నామని సి.బి.ఐ అఫిడవిట్ లో పేర్కొన్న విషయం తెలిసిందే.…

వాళ్ళకి చెప్పే రాశాం, సుప్రీం కోర్టులో సి.బి.ఐ సంచలన వెల్లడి

బొగ్గు కుంభకోణం విషయంలో సుప్రీం కోర్టు సాక్షిగా సి.బి.ఐ కాంగ్రెస్ ధరించిన మేకప్ ను కడిగేసింది. న్యాయ శాఖ మంత్రి కోరిక మేరకు ఆయనకు చూపించిన తర్వాతే బొగ్గు కుంభకోణం స్టేటస్ రిపోర్టును సుప్రీం కోర్టుకు సమర్పించామని కాంగ్రెస్ ముసుగు విప్పి చూపింది. న్యాయశాఖ మంత్రి అశ్వనీ కుమార్ తో పాటు ప్రధాన మంత్రి కార్యాలయం, బొగ్గు మంత్రిత్వ శాఖల అధికారులు కూడా తమ నివేదికను చూశారాని సి.బి.ఐ స్పష్టం చేసింది.  ప్రభుత్వానికి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు…