ఐ.ఎ.ఎస్ లను తంతే…..?–కార్టూన్

ఏం జరుగుతుందో తెలియడానికి ఇంతకు మించి వివరంగా బహుశా ఎవరూ చెప్పలేరేమో! ఐ.ఎ.ఎస్ లను ‘అయ్యా, ఎస్’ లు అని ఆంధ్ర ప్రదేశ్ జనం చెప్పుకుంటారు. వారు అలా ‘అయ్యా, ఎస్’ అని ఎందుకు అనవలసి వస్తోందో ఉత్తర ప్రదేశ్ అధికారి దుర్గాశక్తి నాగపాల్ ఉదాహరణ స్పష్టం చేస్తోంది. అధికారులకు కూడా స్పష్టమైన రూల్స్ ని ప్రభుత్వ గ్రంధాల్లో నిర్దేశించి ఉంచారు. కానీ రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, కంపెనీల స్వార్ధ ప్రయోజనాల కోసం వీటిని నీరుగార్చడం లోనే…

దుర్గ, ఐ.ఎ.ఎస్: ఇసుక మాఫియాకు చెక్ పెట్టినందుకు సస్పెన్షన్

ఈమె పేరు దుర్గ శక్తి నాగపాల్. వయసు కేవలం 28 సంవత్సరాలు. పంజాబ్ కేడర్ ఐ.ఎ.ఎస్ గా ఉత్తర ప్రదేశ్ లో గౌతమ్ బుద్ధ నగర్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గా నియమితురాలయింది. పదవి చేపట్టింది లగాయితు గ్రేటర్ నొయిడా ప్రాంతంలో యమున, హిందోన్ నదుల వెంట ఇసుకను అక్రమంగా తవ్విపోస్తున్న మాఫియాల గుండెల్లో సింహ స్వప్నంగా నిలిచింది. రాజకీయంగా అత్యున్నత స్ధాయి సంబంధాలు కలిగి ఉన్న ఇసుక మాఫియా తన సర్వశక్తులు ఒడ్డిన ఫలితంగా మతపరమైన…

ఐ.ఏ.ఎస్ అధికారి నిజాయితీకి బహుమతి: 44వ బదిలీ

సోనియా గాంధీ జామాత రాబర్ట్ వాద్రా పాల్పడిన అక్రమ భూ ఆక్రమణలపై విచారణకు ఆదేశించి వార్తలకెక్కిన హర్యానా కేడర్ సీనియర్ ఐ.ఏ.ఎస్ అధికారి అశోక్ ఖేమ్కా మరోసారి బదిలీ అయ్యాడు. వాద్రా భూ కుంభకోణం తుట్టె కదిలించినందుకు గత అక్టోబరు నెలలో బదిలీ అయిన ఖేమ్కా, విత్తనాభివృద్ధి సంస్ధ నుండి మళ్ళీ బదిలీ వేటు ఎదుర్కొన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం బదిలీకి కారణం చెప్పలేదు. విత్తనాభివృద్ధి సంస్ధ ఉద్యోగుల పోస్టింగులు, క్రమశిక్షణ చర్యలతో హర్యానా పాలకవర్గాలు కన్నెర్ర చేయడమే…

ప్రభుత్వాలు కూడా ఖాఫ్ పంచాయితీలేనా? -కార్టూన్

“నిన్ను ఇప్పటికిప్పుడే బదిలీ చేసేశాం. ‘అవినీతి’ కులాన్ని నువ్వు గాయపరిచావు” వాద్రా భూ కుంభకోణంపై విచారణకు ఆదేశించినందుకు హర్యానా లాండ్ రిజిష్ట్రేషన్ ఉన్నతాధికారి ‘అశోక్ ఖేమ్కా’ ను ఆ రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. దానికి హర్యానా హై కోర్టు ఇచ్చిన ఆదేశాలే కారణమని ప్రభుత్వం ఇప్పుడు బొంకుతోంది. నాలుగు రోజుల క్రితం అధికారుల బదిలీలు రాష్ట్ర ప్రభుత్వ ‘విచక్షణాధికార హక్కు’ అని చెప్పి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ అశోక్ బదిలీని సమర్ధించుకున్నాడు. బదిలీ పై విమర్శలు…

సోనియా అల్లుడి కేసులో ‘విచ్ హంట్’ మొదలు

సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా కేసులో విచ్ హంట్ మొదలయింది. వాద్రా, డి.ఎల్.ఎఫ్ ల అక్రమ భూ దందా పై విచారణకు ఆదేశించిన సీనియర్ ఐ.ఏ.ఎస్ అధికారిని హర్యానా ప్రభుత్వం ఉన్నపళంగా బదిలీ చేసింది. ఈ బదిలీకి రాష్ట్ర ప్రభుత్వం సరైన కారణం ఏమీ ఇవ్వడం లేదు. 21 సంవత్సరాల సర్వీసులో 43 బదిలీలు ఎదుర్కోవడం అధికారి నిజాయితీకి తార్కాణం గా నిలుస్తుండగా, వాద్రా అక్రమ ఆస్తులపై విచారణకు ఆదేశించిన సదరు అధికారిని ఉన్నపళంగా బదిలీ…