12.6 లక్షల కోట్లు జమ, ఇంకెక్కడి నల్ల ధనం?
ప్రధాని మోడీ అట్టహాసంగా ప్రకటించిన ‘పాత అధిక విలువ నోట్ల రద్దు’ వల్ల ఆశించిన ఫలితం అలా ఉంచి కనీస ఫలితం కూడా దక్కే సూచనలు కనిపించడం లేదు. “నల్ల డబ్బుని నిర్మూలించి డబ్బు నిల్వలను శుభ్రం చేసి, టెర్రరిజం ధన వనరులపై దెబ్బ కొట్టి, దొంగ నోట్లకు చోటు లేకుండా చేయడమే నోట్ల రద్దు లక్ష్యం” అని మొదట ప్రధాని ప్రకటించారు. ఆ తర్వాత ఈ లక్ష్యం పైన నిలబడకుండా మాటలు మార్చుతూ పోయినప్పటికీ జనం…