ఢిల్లీ రాష్ట్ర పీఠం – మ్యూజికల్ చైర్ -కార్టూన్

ఢిల్లీ రాష్ట్రంలో ఓ విచిత్రమైన పరిస్ధితి నెలకొంది. నిజమైన హంగ్ అసెంబ్లీ అంటే ఇదేనా అన్నట్లుగా ఉండడం ఈ విచిత్రంలో ఒక భాగం. ఇంతకు ముందు హంగ్ అసెంబ్లీ లేదా హంగ్ పార్లమెంట్ అనేకసార్లు ఏర్పడినా ప్రస్తుతం ఢిల్లీలో వచ్చిన పరిస్ధితి లాంటిది ఎప్పుడూ ఉద్భవించిన దాఖలా లేదు. గతంలో హంగ్ అసెంబ్లీ అన్నా, హంగ్ పార్లమెంటు అన్నా రాజకీయ సంక్షోభం గానీ రాజ్యాంగ సంక్షోభం గానీ ఉండేది కాదు. అంటే: ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ…

కోడి పిల్లొచ్చి కోడిని వెక్కిరించినట్టు! -కార్టూన్

‘గుడ్డొచ్చి కోడిని వెక్కిరించినట్టు’ అంటాం కదా! కార్టూనిస్టు ఇక్కడ కోడి పిల్లే వచ్చి కోడి తల్లిని వెక్కిరిస్తోందని సూచిస్తున్నారు. అన్నా హజారే కష్టపడి ‘అవినీతి వ్యతిరేక ఉద్యమం’ అనే గుడ్డును పొదిగిన తర్వాత అందులోంచి ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ కోడి పిల్లగా బైటికి వచ్చిందని, ఆ కోడి పిల్ల ఇప్పుడు అన్నా హజారేను వెక్కిరిస్తోందని కార్టూన్ సూచిస్తోంది. అరవింద్ కేజ్రీవాల్, అన్నా హజారేల మధ్య రెండు రోజులుగా ఒక కొత్త వివాదం నడుస్తోంది. అన్నా హజారే, మరో…

సోనియా అల్లుడి కేసులో ‘విచ్ హంట్’ మొదలు

సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా కేసులో విచ్ హంట్ మొదలయింది. వాద్రా, డి.ఎల్.ఎఫ్ ల అక్రమ భూ దందా పై విచారణకు ఆదేశించిన సీనియర్ ఐ.ఏ.ఎస్ అధికారిని హర్యానా ప్రభుత్వం ఉన్నపళంగా బదిలీ చేసింది. ఈ బదిలీకి రాష్ట్ర ప్రభుత్వం సరైన కారణం ఏమీ ఇవ్వడం లేదు. 21 సంవత్సరాల సర్వీసులో 43 బదిలీలు ఎదుర్కోవడం అధికారి నిజాయితీకి తార్కాణం గా నిలుస్తుండగా, వాద్రా అక్రమ ఆస్తులపై విచారణకు ఆదేశించిన సదరు అధికారిని ఉన్నపళంగా బదిలీ…

బి.జె.పి ని కూడా టార్గెట్ చేద్దాం: కేజ్రీవాల్, వద్దు: కిరణ్ బేడీ

బొగ్గు కుంభకోణం కి సంబంధించి  బి.జె.పి ని టార్గెట్ చేసే విషయంలో మాజీ అన్నా బృందం కీలక సభ్యులయిన అరవింద్ కేజ్రీవాల్, కిరణ్ బేడీ ల మధ్య విభేధాలు పొడసూపాయి. బొగ్గు గనులను ప్రవేటు కంపెనీలకు విచ్చలవిడిగా కట్టబెట్టడంలో కాంగ్రెస్, బి.జె.పి లు రెండూ దోషులేనని అరవింద్ కేజ్రీవాల్ భావిస్తుండగా, పాలక పార్టీ అయిన కాంగ్రెస్ ప్రధాన దోషి అని కనుక దానినే టార్గెట్ చెయ్యాలనీ కిరణ్ బేడీ భావిస్తోంది. లోక్ పాల్ విషయంలో పూర్తిగా కాకపోయినా…

పూనే పేలుళ్లు పధకం ప్రకారం జరిగినవే -కేంద్రం

బుధవారం పూనేలో జరిగిన పేలుళ్లు పధకం ప్రకారం జరిగినవేనని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. 500 మీటర్ల పరిధిలో, 45 నిమిషాల సమయంలో జరిగిన ఈ పేలుళ్లు ఒక పధకం ప్రకారం సమన్వయంతో జరిగాయని హోమ్ సెక్రటరీ ఆర్.కె.సింగ్ విలేఖరులకు చెప్పాడు. కేంద్ర దర్యాప్తు సంస్ధలు ఎన్.ఐ.ఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ), ఎన్.ఎస్.జి (నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్), సి.ఎఫ్.ఎస్.ఎల్ (సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ) ల బృందాలు పూణే చేరుకుని పేలుడు పేలుడు జరిగిన ప్రాంతాలను పరిశీలిస్తున్నాయని ఆయన…

‘అన్నా బృందం’ పయనం ఎటు? -కార్టూన్

భారత దేశ ‘రాజకీయ వ్యవస్ధ’, ‘బ్యూరోక్రసీ’ ల అవినీతి పై ‘ఉద్యమాస్త్రం’ ఎక్కు పెట్టిన అన్నా బృందాన్ని విడదీసి తేలిక చేయడంలో ఇరు వ్యవస్ధలూ సఫలం అయినట్లే కనిపిస్తోంది. ప్రధాని మన్మోహన్ సింగ్ బొగ్గు కుంభకోణంలో నిందితుడిగా అన్నా బృందం తాజాగా ఆరోపణలు చేయగా, సదరు ఆరోపణలను అన్నాయే ఆమోదించడం లేదని ఆయన ప్రకటనలు చెబుతున్నాయి. కర్ణాటక మాజీ లోకాయుక్త సంతోష్ హెగ్డే మన్మోహన్ పై ఆరోపణలను నమ్మలేకున్నాడు. స్వామి అగ్నివేశ్ తో సహా అనేకమంది బృందం సభ్యులు…

విచారణ జరిపి నిజాయితీ నిరూపించుకోండి, ప్రధానితో అన్నా బృందం

ప్రధాని మన్మోహన్ సింగ్ అవినీతిపరుడు కాకపోతే తమ కంటే సంతోషించేవారు లేరనీ, అయితే ఆ సంగతి విచారణ జరిపించుకుని నిరుపించుకోవాల్సిందేనని అన్నా బృందం స్పష్టం చేసింది. స్వతంత్ర దర్యాప్తు జరిపించుకోవాలని అన్నా బృందం డిమాండ్ చేసింది. ప్రధానిపై అవినీతి ఆరోపణలు చేసింది తాము కాదనీ, రాజ్యాంగ సంస్ధ కాగ్ నివేదిక ద్వారానే తాము మాట్లాడుతున్నామని స్పష్టం చేశారు. “తనపై కేశినా ఆరోపణలు ఆధారహితమనీ, దురదృష్టకరమనీ, బాధ్యతారాహిత్యమనీ ప్రధాన మంత్రి అన్నారు. మేమాయనకి ఒక విషయం చెప్పదలిచాం. ఆరోపణలు…

అన్నా హజారే పై విమర్శలు, అవినీతి వ్యతిరేక ఉద్యమ విశ్లేషణ -1

అన్నా హజారే భారత దేశంలో రాజకీయ నాయకులు, బ్యూరోక్రసీ అధికారుల అవినీతికి వ్యతిరేకంగా గత సంవత్సర కాలంలో పోరాడుతున్నాడు. నిజానికి అన్నా హజారే పోరాడుతున్నాడు అనడం సమంజసం కాదు. అన్నా హజారే గానీ, ఆయన లాంటివారు గానీ వ్యక్తిగా తలపడి అవినీతి లాంటి సామాజిక, రాజకీయ, ఆర్ధిక చెడుగు పై పోరాడడం సాధ్యమయ్యే పని కాదు. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అన్నా క్రెడిట్ అంతా ఆయన ప్రజలను కూడగట్టగలగడం లోనే ఉంది. అంటే అన్నా చరిత్ర, నిబద్ధత,…

హజారే ఉద్యమంలో మా పాత్ర లేదు -అమెరికా

అన్నా హజారే దీక్ష వెనక అమెరికా ప్రోద్బలం ఉందంటూ కాంగ్రెస్ పార్టీ పదే పదే ఆరోపణలు గుప్పించడంతో అమెరికా నోరు విప్పింది. అన్నా ఉద్యమంలో తమ పాత్ర ఏమీ లేదని స్పష్టం చేసింది. సామాజిక కార్యకర్త అన్నా హజారేకు మద్దతుగా భారత ప్రజలు చేస్తున్న నిరసనలపై అమెరికా అభిప్రాయాన్ని పత్రికలు పలుమార్లు కోరుతుండడంతో ఆ వ్యవహారం భారత దేశ అంతర్గత వ్యవహారంగా అమెరికా ప్రకటించింది. అంతర్గత వ్యవహారం అంటూనే అమెరికా తన పాత హెచ్చరికను మరోరూపంలో కొనసాగించింది.…