గడ్డాఫీ నైగర్‌కు తరలివెళ్ళడానికి సహకరించిన ఫ్రాన్సు?

లిబియాకు దక్షిణాన ఉన్న నైగర్ దేశానికి క్షేమంగా వెళ్లడానికి ఫాన్సు, గడ్డాఫీకి సహకరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. లిబియా ఆర్మీకి చెందిన 200 నుండి 250 వరకూ గల వాహనాల కాన్వాయ్ లిబియా సరిహద్దులను దాటి నైగర్ లోకి ప్రవేశించినట్లుగా రాయిటర్స్, బిబిసి లు వార్తా సంస్ధలు తెలిపాయి. అత్యంత పేద దేశమయిన నైగర్ ఫ్రాన్సుకి మాజీ వలస. ఫ్రాన్సు, నైగర్ ల మిలట్రీ వర్గాలనుండి అందిన సమాచారం మేరకు గడ్డాఫీ పునరావాసం కోసం జరిగిన రహస్య చర్చలు,…

అల్జీరియా, యెమెన్ లలో ప్రదర్శకులను చెదరగొట్టిన ప్రభుత్వాలు

ఈజిప్టులో ప్రజాందోళనల ధాటికి తలొగ్గి ముబారక్ అధికారం త్యజించటాన్ని స్ఫూర్తిగా తీసుకున్న అల్జీరియా, యెమన్ ల పౌరులు తమ నియంతృత్వ ప్రభువులు సైతం దిగి పోవాలని డిమాండ్ చేస్తూ ఆయా రాజధానుల్లో శనివారం  ప్రదర్శనలు నిర్వహించారు. అయితే ముందునుండే అప్రమత్తతతో ఉన్న అక్కడి ప్రభుత్వాలు పోలీసులు, సైన్యాలతొ పాటు తమ మద్దతుదారులను కూడా ఉసిగొల్పి ప్రదర్శనలు పురోగమించకుండా నిరోధించ గలిగింది. “బౌటెఫ్లికా వెళ్ళిపో” -అల్జీరియా ప్రదర్శకులు అల్జీరియా రాజధాని అల్జీర్స్ లో మొహరించి ఉన్న పోలీసులకు భయపడకుండా…