కాళ్ళ బేరం: టెర్రరిస్టుల తరపున ఐరాస?

బహుశా దీనిని ఎవరూ ఊహించి ఉండరేమో! సిరియాలో ప్రభుత్వానికి, సిరియా ప్రజలకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్న జబ్బత్ ఆల్-నూస్రా టెర్రరిస్టులు క్షేమంగా అలెప్పో వదిలి వెళ్లనివ్వాలని ఐరాస ప్రతినిధి స్టాఫన్ డి మిస్తురా కోరుతున్నాడు. సిరియా వ్యవహారాలు చూసేందుకు మిస్తురా ని ఐరాస నియమించింది. నిస్పాక్షికంగా ఉంటూ శక్తివంతమైన రాజ్యాల నుండి బలహీన రాజ్యాలను కాపాడేందుకు ప్రయత్నించవలసిన ఐక్య రాజ్య సమితి ఆచరణలో అమెరికా, పశ్చిమ రాజ్యాల భౌగోళిక రాజకీయాలకు పని ముట్టుగా మారింది. సిరియా కిరాయి…

మా దేశంలో రక్తపాతానికి టర్కీ ఆపాలజీ చెప్పిందా? -సిరియా

టర్కీ నుండి వచ్చిన టెర్రరిస్టుల వల్ల సంవత్సరం ఎనిమిది నెలల నుండి మా దేశ ప్రజలపై అమానుష రక్తపాతం జరుగుతున్నా తమ ప్రజలకు కనీసం సానుభూతి కూడా టర్కీ ప్రకటించలేదనీ, అలాంటిది ఏ తప్పూ చేయకుండా మమ్మల్ని ఆపాలజీ కోరడం ఏమిటని సిరియా ప్రశ్నించింది. సిరియావైపు నుండి జరిగిన దాడిలో టర్కీలో మరణించిన ఇద్దరు మహిళలు, ముగ్గురు పిల్లలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపాము తప్ప ఆపాలజీ చెప్పలేదని స్పష్టం చేసీంది. దాడికి ఎవరు కారకులో తెలుసుకోవడానికి…

పశ్చిమాసియాలో అనూహ్య పరిణామం, చర్చలకు సౌదీ చేరిన ఇరాన్ అధ్యక్షుడు

ఆయిల్ నిల్వలతో సుసంపన్నమైన పశ్చిమాసియా (మధ్య ప్రాచ్యం) ప్రాంతంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఉన్నత స్ధాయి బృందంతో సహా ఇరాన్ అధ్యక్షుడు మహ్మౌద్ అహ్మది నెజాద్ చర్చల నిమిత్తం సౌదీ అరేబియా చేరుకున్నాడు. సౌదీ రాజు ‘అబ్దుల్లా బిన్ అబ్దులాజీజ్’ వ్యక్తిగతంగా అహ్మదీ నెజాద్ ను ఆహ్వానించడం మరో ముఖ్య పరిణామం. అహ్మది నెజాద్ తో సమావేశానికి సౌదీ అరేబియా ఎంతటి ప్రాముఖ్యత ఇస్తున్నదీ ఈ అంశం తెలియజేస్తోంది. సౌదీ అరేబియా, కతార్, టర్కీ ల…