సమాన దూరం అయింది, ఇజ్రాయెల్ కౌగిలి మిగిలింది

గాజాపై అత్యాధునిక క్షిపణులతో నరహంతక దాడులు చేసి 2016 మందిని ఇజ్రాయెల్ బలి గొన్న రోజుల్లో పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య సమాన దూరం పాటించడం తమ విధానం అని ప్రకటించి మోడి ప్రభుత్వం తన అంతర్జాతీయ దివాళాకోరుతనం చాటుకుంది. ఇప్పుడు ఏకంగా ఇజ్రాయెల్ పక్షాన చేరిపోయి, అనాదిగా ఆక్రమిత పాలస్తీనాకు ఇస్తున్న మద్దతును ఏకపక్షంగా ఉపసంహరించుకునేందుకు మోడి ప్రభుత్వం ఉవ్విళ్లూరుతోందని పత్రికల వార్తల ద్వారా తెలుస్తోంది. అదే జరిగితే భారత విదేశాంగ విధానాన్ని అత్యంత హీనమైన, ప్రగతి విహీనమైన…