ప్రశ్న: గ్లోబల్ సౌత్, గ్లోబల్ నార్త్ గురించి వివరించండి

ప్రశ్న (పేరు ఇవ్వలేదు): క్యూబా వ్యాక్సిన్ ఆర్టికల్ లో గ్లోబల్ సౌత్ అన్న పదజాలం వాడారు. భూమధ్య రేఖకు దిగువ దేశాలు అంటూనే ‘కొన్ని పరిమితులతో’ అన్నారు. కాస్త వివరించగలరు. జవాబు: ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకోవడం చాలా అవసరం. ప్రపంచ స్ధాయి పరిణామాలు, ముఖ్యంగా భౌగోళిక రాజకీయార్ధిక పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు ఆంగ్ల పత్రికలు తరచుగా గ్లోబల్ నార్త్, గ్లోబల్ సౌత్ అన్న పదజాలాల్ని ఉపయోగిస్తాయి. ఈ పేర్లు సూచించే విధంగా ఉత్తరార్ధ గోళంలో ఉన్న…

మా వ్యతిరేక కూటమిలో ఇండియా చేరదు -చైనా

భారత ప్రధాని నరేంద్ర మోడి అమెరికా పర్యటన ముగిసిన నేపధ్యంలో పర్యటన అనంతర పరిస్ధితిని చైనా ప్రభుత్వ అధికార పత్రిక పీపుల్స్ డెయిలీ సమీక్షించింది. అమెరికా తన నేతృత్వంలో తలపెట్టిన చైనా వ్యతిరేక కూటమిలో ఇండియా చేరే అవకాశం లేదని మోడి అమెరికా పర్యటన ద్వారా గ్రహించవచ్చని పత్రిక పేర్కొంది. తమ అవగాహనకు కారణాలను పత్రిక వివరించింది. భారత విదేశీ విధానం పునాదులు అలీన ఉద్యమంలో ఉన్నందున ప్రపంచ ధృవ పోటీల్లో ఇండియా ఒక పక్షం వహించబోదని…

అమెరికా ఇజ్రాయెల్ వద్దన్నా సరే, ఇరాన్ అలీన సభకి వెళ్తా -బాన్

ధూర్త రాజ్యాలయిన అమెరికా, ఇజ్రాయెల్ అభ్యంతరాలను పక్కన బెట్టి, ఐక్యరాజ్య సమితి అధిపతి బాన్ కి మూన్ ఇరాన్ వెళ్లడానికే నిర్ణయించుకున్నాడు. ఆగస్టు 30-31 తేదీల్లో ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో అలీన దేశాల సభ జరగనున్నది. ‘అలీనోద్యమం’ లో సభ్యులైన 119 దేశాలతో పాటు ‘పాలస్తీనా ఆధారిటీ’ కూడా ఈ సభకు హాజరుకానున్నాయి. లిబియా, సిరియా కిరాయి తిరుగుబాట్లలో దుష్ట నాటోకి అధికార ప్రతినిధి తరహాలో ప్రకటనలు ఇచ్చిన బాన్, అమెరికా ఇష్టానికి భిన్నంగా ఇరాన్…

‘ఉగ్రవాద వ్యతిరేక యుద్ధం’పై అమెరికాకు ప్రోగ్రెస్ రిపోర్టు సమర్పించుకున్న భారత ప్రభుత్వం -వికీలీక్స్ – 2

2005, 2007 ల మధ్య కాలంలో అమెరికా, ఇండీయా లమధ్య అణు ఒప్పందం కుదరడం వెనక అన్ని పనులు పూర్తి కావడంలో తీవ్రంగా శ్రమించిన జై శంకర్ ఇప్పుడు ఇండియా తరపున చైనాకు రాయబారిగా పని చేస్తున్నాడు. రాబర్ట్ బ్లేక్ ఆ తర్వాత శ్రీలంక, మాల్దీవులకు అమెరికా రాయబారిగా పని చేశాడు. ఈయన ఇప్పుడు అమెరికా ప్రభుత్వంలోని స్టేట్ డిపార్ట్ మెంటు లో దక్షిణ, మధ్య ఆసియా దేశాల వ్యవహారాల శాఖకు అసిస్టెంట్ సెక్రటరీగా పని చేస్తున్నాడు.…