మసీదు-మందిరం తీర్పుని సస్పెండ్ చేసిన సుప్రీం కోర్టు

వివాదాస్పద బాబ్రీ మసీదు, రామ జన్మ భూమి స్ధలాన్ని మూడు భాగాలు చేసి పంచిన అలహాబాద్ హై కోర్టు తీర్పును సుప్రీం కోర్టు సస్పెన్షన్‌లో ఉంచింది. మూడు భాగాలుగా పంచడం వెనక హై కోర్టు ఇచ్చిన కారణాలను ఇద్దరు సభ్యులు గల సుప్రీం బెంచ్ ప్రశ్నించింది. బాబరు నిర్మించాడని చెబుతున్న మసీదును ఒక హిందూ దేవాలయాన్ని కూల్చి నిర్మించినట్లుగా ఆరోపిస్తూ 1992 డిసెంబరు 6 తేదీన హిందూ మత సంస్ధలకు చెందిన కార్యకర్తలు కూల్చివేశిన విషయం విదితమే.…