ప్రపంచ అసమానతల్లో పెరుగుదల -ది హిందు ఎడిట్
నిజ వేతనాలపై అంతర్జాతీయ కార్మిక సంస్ధ (ఐ.ఎల్.ఓ) తాజాగా వెలువరించిన నివేదిక కనుగొన్న అంశాలు వివిధ సందర్భాలలోని క్రియాశీల చొరవలను, విధానపరమైన పక్షవాతాన్ని సూచిస్తున్నాయి. ప్రపంచ నిజ వేతనాలు పడిపోతుండడం కొనసాగుతుండడం వల్లా, జాతి మరియు లింగ ఆధారిత వివక్షాపూరిత వేతన తేడాల వల్లా కుటుంబాల ఆదాయాలలో అసమానతలు తీవ్రం అవుతున్నాయని ఈ అధ్యయనం పేర్కొంది. అధ్యయనంలో కొట్టొచ్చినట్టు కనపడుతున్న అంశం, అభివృద్ధి చెందిన దేశాలలో 1999-2013 సంవత్సరాల మధ్య కాలంలో కార్మిక ఉత్పాదకత పెరుగుదల వారి…