నోట్ల రద్దు: టమాటో పంటను పశువులకు మేపుతున్న రైతులు
పెద్ద నోట్ల రద్దు వలన గట్టి దెబ్బ తిన్నవారిలో రైతులు ముఖ్యమైన వారు. ‘దేశానికి అన్నం పెట్టె రైతన్న’ అనీ, ‘దేశానికి వెన్నెముక’ అనీ ‘జై జవాన్, జై కిసాన్’ అనీ సవాలక్ష అలంకారాలతో రైతులను నెత్తిన పెట్టుకున్నట్లు కనిపించే ప్రభుత్వాలు ఆచరణలోకి వచ్చేసరికి రైతాంగాన్ని చావు దెబ్బ తీసే విధానాలను అమలు చేయటానికి ఎంత మాత్రం వెనకడుగు వేయరు. నోట్ల రద్దు నిర్ణయం వల్ల అటు ఖరీఫ్ రైతులు, ఇటు రబీ రైతులు ఇరువురూ తీవ్రంగా…